ప్రాణంగా ప్రేమించాడు... ఆ యువతి తోనే జీవితం మొత్తం ఊహించుకున్నాడు... ఎన్నో రోజుల పాటు ప్రేమలో మునిగితేలారు... చివరికి పెళ్లి విషయానికొచ్చేసరికి యువతి అంగీకరించలేదు. దీంతో ప్రేమికుడు కాస్త కీచకుడిగా మారిపోయాడు. తన ప్రియురాలు పెళ్ళికి ఒప్పుకోలేదని అక్కసుతో ఏకంగా ప్రియురాలిపై అత్యాచారం కి ఒడిగట్టి దారుణానికి పాల్పడ్డాడు, ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని రాంచి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... రాంచి జిల్లాలోని ఓరిమంజి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికతో గత కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతున్నాడు.


ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఏకంగా బాలిక తల్లిదండ్రుల వరకు వెళ్ళింది. ఇక సదరు మైనర్ బాలికను  తల్లిదండ్రులు మందలించి ఆ యువకుని మర్చిపోవాలంటూ  బెదిరించారు. తల్లిదండ్రులు చెప్పిన మాట విని మనసు మార్చుకున్న బాలిక.. మన పెళ్ళికి తమ పేరెంట్స్  ఒప్పుకోలేదని... నన్ను మర్చిపోవాలి అంటూ ప్రియుడికి చెప్పింది. ఈ క్రమంలో వేరే వ్యక్తితో తల్లిదండ్రులు పెళ్లి నిర్ణయించగా ఆ పెళ్ళికి అంగీకరించింది సదరు యువతి. దీంతో ప్రాణంగా ప్రేమించిన యువకుడు కోపంతో ఊగిపోయాడు ప్రేమ పేరుతో తను వాడుకొని వదిలేసింది అంటూ ఆ యువతి పై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే గతనెల 23న కుటుంబ సభ్యులు అందరూ బయటకు వెళ్లిన సమయంలో బాలిక ఒంటరిగా ఉందని తెలుసుకుని..  ఇంట్లోకి చొరబడి యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.



 ఈ విషయం బయటికి పొక్కితే ప్రాణాలు తీస్తాను అంటూ బెదిరించాడు. ఇక తల్లిదండ్రుల వచ్చాక కాస్త ధైర్యం చేసుకుని యువతి జరిగిన విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు తోసారు  పోలీసులు.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: