వంకాయకు మన భారతదేశమే పుట్టినిల్లు. ప్రాచీన కాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ శాక రాజం, ఆధునిక యుగంలో కూడ అగ్రస్థానంలో నిలిచింది. తెలుగువారితో విడదీయరాని బంధం ఏర్పరచుకొంది. గుత్తి వంకాయ కూరను ఇష్టపడిన వ్యక్తులు ఎవరుంటారు చెప్పండి. మాంచి మసాలా దట్టించి.. నూనెలో వేయించి కాడతో సహా ఆరగిస్తే భలే మజాగా ఉంటుంది. అయితే, కొందరు మాత్రం వంకాయను తినేందుకు వెనకాడతారు. ఎందుకంటే.. అందరికీ వంకాయ పడదు. స్కిన్ అలర్జీలతో బాధపడేవారు వంకాయలను దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు తెలిపారు. కానీ వంకాయ వలన చాల ప్రయోజనాలు ఉన్నాయి.

 

 

వంకాయలో కొవ్వులు శూన్యం. మాంసకృత్తులు నామమాత్రంగాను, పిండి పదార్థాలు ఓ మోస్తరుగాను ఉంటాయి. 3.5 శాతం శర్కర, మూడు శాతం పీచుపదార్థాలు ఉంటాయి. బీ కాంప్లెక్సు, ఫోలేట్లు, సి, కె, ఎ విటమిన్లు చక్కగా లభిస్తాయి. ఒక శాతం ఐరన్, మూడు శాతం మెగ్నీషియం ఉంటాయి. సోడియం శూన్యం, క్యాల్షియం సమృద్ధిగాను, పొటాషియం అత్యధికంగాను లభిస్తాయి. కాబట్టి బలకరం, స్థౌల్యహరం, సుఖ విరేచనకారి. రక్తపోటుని అదుపు చేసి గుండెకు మేలు చేస్తుంది.

 

 

టైప్-2 మధుమేహం రోగుల రక్తంలోని చక్కెర్ల (గ్లోకోజ్) స్థాయిని తగ్గించడంలో వంకాయ బాగా పనిచేస్తుంది. వంకాయలో పిండి పదార్థాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రైట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది.వంకాయ శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

 

 

వంకాయలోని ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి. వంకాయ శరీరంలోని అదనపు ఐరన్‌ను తొలగిస్తుంది. వంకాయలో కరిగే పైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది. వంకాయ శరీరంలోని విషతుల్యాలను, వ్యర్థాలను తొలగిస్తుంది. శరీరానికి అందే కెలోరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. వంకాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: