కరోనా కరోనా  కరోనా.. ఎవరి నోట చూసినా ఇదే మాట... ఎక్కడ చూసినా ఇదే భయం... ప్రపంచమంతా ప్రాణభయం... మనిషి ప్రాణాలకు గ్యారెంటీ లేని రోజులు వచ్చేశాయి.. ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం విలయ తాండవం చేస్తూ ఎంతో మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి వైరస్ కారణంగా మానవ జీవితం కాస్త అతలాకుతలం అయిపోయింది.


 అయితే ఈ మహమ్మారి వైరస్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న చాలామంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు అన్న  విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యంలో ఎలాంటి రవాణా సౌకర్యాలు కూడా అందుబాటులోకి లేకపోవడంతో... వివిధ పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన వారు చాలా మంది అక్కడ ఇరుక్కుపోయారు. ఈ క్రమంలోనే విదేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.


అదే సమయంలో భారత దేశం లో చిక్కుకుపోయిన విదేశీయులను ఇతర దేశాలకు పంపేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. ఇక వివిధ పనుల నిమిత్తం భారత్కు వచ్చిన విదేశీయులు తమ తమ దేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే... అమెరికాకు చెందిన ఓ విదేశీయుడు మాత్రం తాను అమెరికా కు వెళ్లనని ఇక్కడే ఉంటాను అంటూ చెబుతున్నాడు. అమెరికాకు చెందిన జాన్ పాల్ ప్రియర్స్  అనే 74 ఏళ్ల వ్యక్తి... తాను  కేరళలోనే ఉంటాను అంటూ న్యాయ పోరాటానికి దిగాడు.  కేరళలో తనకు ఎంతో ప్రశాంతంగా ఉందని తన విజిటింగ్ వీసా ని  బిజినెస్ గా మార్చాలని ఇక్కడే సెటిల్ అవుతాను అంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు ఆ వ్యక్తి. భారతీయ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తనకు ఇక్కడ ఉండే అవకాశం ఉంటుందని... కానీ ప్రస్తుతం తన వయసు దృష్ట్యా పెళ్లి చేసుకోలేను అంటూ చెప్పుకొచ్చాడు.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: