దేశంలో మార్చి నెల మొదట్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ప్రజలు స్వచ్చంధంగా మాస్క్ లు ధరిస్తూ వైరస్ భారీన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేవారు. ఆ తరువాత కేసుల సంఖ్య పెరగడంతో కేంద్రం లాక్ డౌన్ ను విధించింది. లాక్ డౌన్ వల్ల ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావడంతో తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. మే 31 వరకు కేంద్రం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేసింది. 
 
అయితే ఆర్థికంగా దేశం తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో జూన్ 1 నుంచి అన్ లాక్ 1.0 అమలులోకి తెచ్చింది. అప్పటివరకు పెద్దగా జనసంచారం కనిపించని రోడ్లపై సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మాస్క్ లు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మరికొందరు మాత్రం నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నారు. వీళ్ల ద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. 
 
దేశంలో గత 24 గంటల్లో 24,879 కేసులు నమోదయ్యాయి. తొలిసారి 25,000 మార్కుకు దగ్గరగా కేసులు నమోదయ్యాయి. కేంద్ర, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం కరోనా బాధితుల సంఖ్య 7,67,296కు చేరగా ఒక్కరోజే 487 మంది మృతి చెందారు. దేశంలో కరోనా మృతుల సంఖ్య 21,129గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 62 శాతంగా ఉంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 2,23,724కు చేరగా... 9448 మంది మృతి చెందారు. 
 
తమిళనాడులో నిన్న ఒక్కరోజే 3756 కేసులు నమోదు కాగా కేసుల సంఖ్య 1,22,350కు చేరింది. వీరిలో 1700 మంది మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. వైరస్ వ్యాప్తిని చూస్తుంటే ఇప్పట్లో వైరస్ ను నియంత్రించటం సాధ్యమా....? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. భారత్ లో పరిస్థితి అదుపు తప్పుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: