గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరిగిపోతూ వస్తున్నాయి. దేశంలో న‌మోదైన పాజిటివ్ కేసులు 7,67,296 చేరుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన‌వారి సంఖ్య 21,129కు పెరిగింది.. క‌రోనా బారిన‌ప‌డి ప్ర‌స్తుతం 2,69,789 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతుండ‌గా.. ఇక‌, క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయిన‌వారి సంఖ్య  4,76,378కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసులతో భయపడుతున్న గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మంచి శుభవార్త..జీహెచ్ఎంసీ పరిధిలో నిన్నటి నుంచి ర్యాపిడ్ యాంటిజెన్ కొవిడ్-19 పరీక్షలు ప్రారంభమయ్యాయి.

 

ట్విస్ట్ ఏంటేంటే.. ఈ టెస్టుల ద్వారా కేవలం అరగంటలోనే ఫలితం తెలుసుకోవచ్చు. ఒక్కో ఆరోగ్య కేంద్రం పరిధిలో 25 మందికి పరీక్షలు చేయనుండగా, తొలి రోజు మూడు జిల్లాల్లో సుమారు 700  మందికి పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్‌టీ-పీసీఆర్) విధానంలో కరోనా పరీక్షలు చేయగా, ఇప్పుడు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

 

హైదరాబాద్‌లో 50 అర్బన్ హెల్త్ సెంటర్లు, రంగారెడ్డి జిల్లాలో 20, మేడ్చల్‌లో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ విధానంలో తొలిసారి పాజిటివ్ ఫలితం వస్తే రెండోసారి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, నెగటివ్ వస్తే మాత్రం ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకుని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మద్య లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి తెలంగాణలో కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: