దేవుడు కొంత మందికి జ్ఞానం ఇస్తుంటారు.. అది పేద, ధనకి అనే తేడా ఉండదు.  కఠిక పేద అయినా సరే కష్టపడి చదివి ఉన్నత స్థానం సాధించిన వారు ఎంతో మంది ఉన్నారు. కోట్లకు పడగలెత్తినా.. పొట్ట కోస్తే అక్షర జ్ఞానం లేని వారు కూడా ఉన్నారు.  కోట్లు పెట్టి కార్పోరేట్ చదివినా.. గవర్నమెంట్ స్కూళ్లో చదివినా రిజల్ట్ సమయంలో ఎవరి టాలెంట్ వారిదే. మన దేశంలో ఎంతో మంది నిరుపేదలు తమ పిల్లల్ని మంచి చదువు చదివించలేక మద్యలోనే ఆపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.  ఎక్కడో అక్కడ ప్రోత్సహించిన వారు మంచి ఉన్నతమైన పొజీషన్ కి వచ్చినవారు ఉన్నారు. తాజాగా ఫుట్‌పాత్‌పై చదువుకుంటూనే పదో తరగతిలో ఫస్ట్‌ క్లాస్ మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా మారింది.

IHG's Daughter Gifted With a Flat After She Secured ...

కష్టపడి చదివి ఏకంగా 68 శాతం మార్కులు తెచ్చుకుంది.  ఆ బాలిక కష్టం.. గొప్పతనం అక్కడి మున్సిపాలిటీ అధికారుల గుండెలను కదిలించాయి.. బహుమతిగా ఏకంగా ఇల్లు ఇచ్చారు.  ఈ సంఘటన మద్యప్రదేశ్ లో జరిగింది.   ఆ బాలిక ప్రతిభ కారణంగా వారికి నిలువ నీడ దొరికినందుకు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆ బాలిక కుటుంబం ఫుట్‌పాత్ నుంచి సొంత ఇంటిలోకి అడుగుపెట్టనుంది. దశరథ్ అనే వ్యక్తి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఓ ఫుట్‌పాత్‌పైనే జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజూ కూలీ పనికి వెళ్తేనే వారికి కుటుంబ పోషణ.  

IHG

ఈ మద్య కరోనా కారణంగా ఆ కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో అతని కూతురు భర్తీ ఖండేకర్ తమ జీవితాల మార్పునకు చదువే మార్గమని నమ్మింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. ఇటీవల వచ్చిన పది ఫలితాల్లో 68 శాతం మార్కులు సాధించింది.  ఈ విషయంపై స్పందించిన మున్సిపల్ అధికారులు ఇల్లు బహుమతిగా ఇచ్చారు.. అంతే కాదు ఆ బాలిక ఇంకా పై చదువులు చదువుకోవాలని మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: