రైలు లో ప్రయాణించే ప్రతి ఒక్కరికి ఇది శుభవార్త. అయితే ఇప్పుడు మరో 151 కొత్త ట్రైన్స్ ప్రారంభం కానున్నాయి. ఈ రైళ్లు ఇండియన్ రైల్వే నెట్వర్క్ లోకి రాబోతున్నాయి. ఈ ట్రైన్స్  వేగం  కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆధునిక టెక్నాలజీతో ఇవి తయారవుతున్నాయి. కేంద్రం కొత్త ట్రైన్స్ నడపడానికి శ్రీకారం చుట్టింది. రైల్వే మంత్రిత్వ శాఖ అదనపు రైళ్లు నడపడానికి యోచిస్తోంది. ఎక్కువ రద్దీగా ఉన్న చోట్ల ఈ ట్రైన్స్ అందుబాటు లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇది సొంతంగా ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలని ప్రణాళిక వేసుకున్నారు. అయితే ప్రైవేట్ కంపెనీలు ఈ 151 ట్రైన్ లని రద్దీ ఉన్న రూట్లలో నడపనున్నాయి .

 

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే బిడ్లని కూడా ఆహ్వానించింది. దీని కోసం ప్రైవేట్ కంపెనీలు  అప్లై చేసుకోవచ్చు అని తెలిపింది . అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ అయి పోయిన తర్వాత ఈ 151 ట్రైన్స్ కూడా అందుబాటు లో ఉంటాయి. ప్రస్తుతం ఈ ట్రైన్ రైల్వే నెట్వర్క్ లో అదనంగా నడుస్తాయి.  దాదాపు రూపాయలు 30 వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ రావచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తొలి  సారిగా ఇండియన్ రైల్వే నెట్వర్క్ లో పాసింజర్ ట్రైన్స్ వాడటానికి అనుమతి ఇచ్చింది వీటికి ప్రైవేట్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ లు చేయడం విశేషం.

 

అయితే ట్రైన్ తయారీ వాటి నిర్వహణ, మెయింటెనెన్స్ వంటి వాటిని ప్రైవేట్ కంపెనీలు చూసుకోవాలి ఈ ట్రైన్  స్పీడ్ గంటకు 160 కిలో మీటర్లు.  ప్రైవేట్ కంపెనీలు మాత్రం వాళ్లకు వచ్చే రాబడి లో కొంత మొత్తాన్ని కేంద్రానికి చెల్లించ వలసి ఉంటుంది. ఇలా కేంద్రం ఈ కొత్త రైళ్లని తీసుకు రాబోతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: