ఆధార్ కార్డు లో అడ్రస్ మార్చుకోవాలి అనుకుంటున్నారా...?  అయితే మీరు సులువుగా మార్చుకోవచ్చు. ఈ పద్ధతిని కనుక మీరు అనుసరిస్తే సులువుగా మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ని మీరు మార్చుకోవచ్చు. తాజాగా ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకునే నిబంధనలపై యుఐడిఎఐ కొన్ని నిబంధనలను సరళీకరిచింది.ఈ పద్ధతిని అనుసరించి మీ ఆధార్ కార్డ్ లో  ఉన్న అడ్రస్ ని ఇలా మార్చుకోండి. మీరు ఎక్కడైనా అద్దె ఇళ్ళలో ఉంటున్నారా..?  ఇల్లు షిఫ్ట్ అయిపోయి పాత అడ్రస్  మీ ఆధార్ కార్డులో ఉండిపోయిందా..?   మీకు ఇంకా ఆ చింత లేదు. ఆధార్ కార్డు లో మీరు ఈ విధంగా అడ్రస్ ని  మార్చుకోవచ్చు. దీని వల్ల సులువుగా ఎవరైనా సరే వాళ్ళ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ని  మార్చుకోవచ్చు.

 

దీనికోసం మీ వద్ద రెంట్ అగ్రిమెంట్ ఉంటే సరిపోతుంది. ఈ రెంట్ అగ్రిమెంట్లో కచ్చితంగా మీ పేరు ఉండాలి. లేకపోతే కుదరదు కాబట్టి అగ్రిమెంట్లో మీ పేరు కనుక ఉంటే మీరు ఏ చింతా లేకుండా మీ అడ్రస్ ని అప్ డేట్ చేసుకోవచ్చు అయితే దీనిని మార్చుకోవాలంటే ముందుగా మీరు ఆధార్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి అంటే యూఐడిఏఐ  పోర్టల్ ఓపెన్ చేయాలి అక్కడ  ఎడ్రెస్ అప్ డేట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటిపి సహాయంతో లాగిన్ అవ్వండి.

 

తర్వాత మీ రెంట్ అగ్రిమెంట్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీ నెంబర్ కు ఒక మెసేజ్ వస్తుంది ఈ మెసేజ్ ద్వారా ఆధార్ అప్డేట్ స్టేటస్ మీరు తెలుసుకోవచ్చు ఇలా ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు లేదా ఆఫ్ లైన్ లో మీరు కనుక చేసుకోవాలంటే రూపాయలు యాభై చెల్లించాల్సి ఉంటుంది గతంలో ఈ ధర 25 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు రూ 50 కి మారింది ఇలా మీరు ఆఫ్ లైన్ లో కూడా మీ ఎడ్రస్ ని మార్చవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: