ప్రతి నెలా కూడా మీరు తక్కువ డబ్బు తోనే మంచి రాబడి పొందాలని అనుకుంటున్నారా..?  అయితే తప్పకుండా మీరువీటి వివరాలు చూడాల్సిందే. 60 ఏళ్లు దాటిన తర్వాత పెన్షన్ పొందాలని అనుకుంటూ ఉంటే కూడా ఇది మీకు మంచి సువర్ణవకాశం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో రకాల పథకాలని అందిస్తోంది. అయితే ఇటీవలే మరో కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో అటల్ పెన్షన్ యోజన స్కీం కూడా ఒకటి ఉంది.

 

ఈ స్కీమ్ ద్వారా మీరు అధిక రాబడి పొందడానికి అవకాశం ఉంది. ఈ స్కీమ్ లక్ష్యం ఏమిటంటే అసంఘటిత రంగంలోని పేద  ప్రజలకు సహాయం చేయడం. ఇందులో చేరిన వారికి ప్రతి నెలా క్రమం తప్పకుండా పెన్షన్ వస్తుంది. ఈ స్కీమ్ లో  చేరిన వారికి రూపాయలు 5,000 వరకు పెన్షన్ వస్తుంది కనీసం వెయ్యి రూపాయలు పెన్షన్ కూడా పొందవచ్చు. మీరు చెల్లించే మొత్తం పై ఆధారపడి ఉంటుంది మీ పెన్షన్. రూపాయలు 1000, 2000, 3000, 4000 ఇలా మీరు ఫించెన్  పొందవచ్చు.

 

అయితే రూపాయలు 5,000 పెన్షన్ తీసుకోవాలని మీరు అనుకుంటే రూపాయలు 210 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వాళ్లు అర్హులు బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ పథకంలో మీరు ఇప్పుడే చేరవచ్చు. ఇందులో భాగస్వామి వివరాలు లేదా నామిని వివరాలు  కచ్చితంగా అందించాల్సి ఉంటుంది.  స్కీం లో చేరిన వాళ్ళకి కార్డు కూడా  ఇస్తారు. పద్దెనిమిదేళ్ల వయసులో ఉన్నవారు ఈ స్కీం లో చేరితే వెయ్యి రూపాయల పెన్షన్ కోసం మీరు 42 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అదే ఐదు వేల పెన్షన్ కోసం నెలకు 200 రూపాయలు చెల్లించాలి. ఇలా వయసుని బట్టి పెన్షన్ ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: