తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త బయటకు రావడం ఇప్పుడు కలకలం రేగుతోంది. ముఖ్యంగా తెలంగాణ సీఎం కెసిఆర్ మరికొద్ది రోజుల్లోనే తన కుమారుడు కేటీఆర్ కు సీఎం బాధ్యతలు అప్పగించబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దీనికి తగ్గట్టుగానే కేటీఆర్ ను పార్టీలోను, ప్రభుత్వంలోను యాక్టివ్ చేసి ఆయనను ముందు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉంటూ వచ్చిన హరీష్ రావు ను సైతం పక్కకు పెట్టి కేటీఆర్ ప్రాధాన్యత పార్టీలో బాగా పెంచారు. ఇక కెసిఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లిపోతున్నారని , కరోనా హడావుడి ముగిసిన తర్వాత సీఎంగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం ఊపందుకుంది. ఈ  సమయంలో అకస్మాత్తుగా బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం కలకలం రేపుతోంది.

 

" పట్టాభిషేకం సంతో ష్ కా  కేటీఆర్ కా ? అంటూ ఆయన పోస్ట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ధర్మపురి అరవింద్ ఆ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వెనుక కారణాలేంటి అనే చర్చ జరుగుతోంది . గత కొద్ది రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎవరికీ అందుబాటులో లేరు. పామ్ హౌస్ కి మాత్రమే పరిమితం అయిపోయిన నేపథ్యంలో ధర్మపురి అరవింద్ ఈ విధంగా పోస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఒక్కసారిగా సంతోష్ పేరు తెరమీదకు వచ్చింది. సంతోష్ వరసకు కేసీఆర్ కు కొడుకు అవుతాడు. కెసిఆర్ పీఏగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఆ పార్టీలో ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగారు. అలాగే రాజ్యసభ సభ్యుడిగానూ ఇప్పుడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు . కెసిఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనక సంతోష్ ఉంటారు.

 

ఆయన ఢిల్లీకి వెళ్లినా వెంట సంతోష్ ఉండాల్సిందే. అంతగా ఆయన కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో ధర్మపురి అరవింద్ సంతోష్ ను టార్గెట్ చేసుకుంటూ త్వరలోనే ఆయనకు సీఎం కుర్చీ అప్పగిస్తున్నారు అనే ప్రచారం మొదలు పెట్టడంతో టిఆర్ఎస్ లోనూ ఈ వ్యవహారం కాక రేపుతోంది. నిజంగానే కేసీఆర్ సంతోష్ కు సీఎం కుర్చీ అప్పగించాలని చూస్తున్నారా అనే విషయంపై ఇప్పుడు టిఆర్ఎస్ లోనూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: