కాన్పూర్ లో 8 మంది పోలీసుల ప్రాణాలను తీసిన కరడు గట్టిన గ్యాంగ్ స్టర్ వికాశ్ దుబే ఎట్టకేలకు పోలీసులు దొరికిపోయాడు.  మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో గురువారం ఉదయం అరెస్టు చేశారు. ఆలయానికి సమీపంలో తానే వికాస్ దుబే అంటూ గట్టిగా అరవడంతో స్థానికులు అప్రమత్తం అయ్యారు. వెంటనే ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతన్ని అధికారులు రహస్య ప్రాంతానికి తరలించారు. నాలుగు రోజులుగా తప్పించుకు తిరుగుతున్న దుబే పోలీసులకు చిక్కడంతో అతడి నేర  సామ్రాజ్యంపై విచారణ జరిపే అవకాశ కనిపిస్తోంది. ఇప్పటికే దుబే పై 60 కేసులు ఉన్నాయి.

IHG

ఈ మద్య అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్లిన వారిని దారుణంగా హతమార్చాడు. వారిలో డీఎస్పీ, ఎస్పీ, కానిస్టేబుళ్లు ఉన్నారు. అప్పటి నుంచి ఈ కేసు సీరియస్ గా తీసుకొని అతని అనుచరులను ఒక్కొక్కరినీ ఎన్ కౌంటర్ చేస్తూ వచ్చారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే వికాస్ దూబే కోసం వందల మంది పోలీసులు వెతుకుతున్నా ఉజ్జయిని దేవాలయంలో గార్డుకు దొరకడం ఆసక్తిగా మారింది.  అయితే తన కొడుకు చేసిన నేరం ఘోరం అని.. అతన్ని ఎన్ కౌంటర్ చేసి చంపినా పరవాలేదు అని దుబె తల్లి అన్నారు.

IHG's ...

 ఇప్పుడు త‌న కుమారుడిని మ‌హాకాళేశ్వ‌రుడే రక్షించాడని వ్యాఖ్యానించారు. ఉజ్జయినిలోని మహాకాళ్‌‌ ఆలయంలో ఈరోజు ఉదయం వికాస్ దుబే పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వికాస్ దుబే త‌ల్లి స‌రళాదేవి ఒక ప్రైవేట్ చాన‌ల్‌తో మాట్లాడుతూ తన కుమారుడు ప్రతి ఏటా మ‌హాకాళ్వేశ్వ‌రుని ద‌ర్శ‌నానికి వెళుతుంటాడ‌ని తెలిపారు. ఇప్పుడు ఆ మ‌హాకాళేశ్వ‌రుడే వికాస్ దుబేను రక్షించాడ‌ని ఆమె పేర్కొన్నారు. ప్ర‌భుత్వ‌మే అత‌నికి త‌గిన శిక్ష విధిస్తుంద‌ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: