దేశంలో కరోనా కేసులు మొదట కేరళాలో మొదలయ్యాయి. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకిందని అన్నారు. ఆ తర్వాత మహమ్మారి దేశమంతా పాకింది. ఇప్పుడు దేశంలో కరోనా విజృంభిస్తుంది.  మొన్నటి వరకు అమెరికా, బ్రెజిల్ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు భారత్‌లో శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా కేసుల్లో అగ్రస్థానంలో ఉన్న ఆ రెండు దేశాల కంటే భారత్‌లోనే కేసుల వృద్ధి రేటు అధికంగా ఉంది.  గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 24,879 మందికి కొత్తగా వ్యాధి లక్షణాలను గుర్తించారు. 487 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 7,67,296కు చేరగా.. మరణాలు 21,129కు పెరిగాయి.

 

4,76,378 మంది వైరస్‌ను జయించి ఇంటికి వెళ్లిపోయారు. ఇంకా  2,69,789 మందికి చికిత్స కొనసాగుతోంది.  ఇక  కేరళలోని తిరువనంతపురంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. తిరువనంతపురంలో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించిన ప్రభుత్వం అది స్ట్రిక్ట్‌గా అమలయ్యేందుకు కమాండోలను దించింది. తిరువనంతపురం పరిధిలోని పుంథూరాలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నందున ఆ ప్రాంతంలో కమాండోలను మోహరించారు.  

 

రాష్ట్రంలో గత ఐదు రోజుల్లో కరోనా కేసులు పెరిగాయి. పుంథూరా ప్రాంతంలో 600 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఏకంగా 119 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే ప్రతి ఆరుగురికిలో ఒకరికి కరోనా సోకిందని తేలింది. దీనికి తోడు పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి ఇటీవల 120 మందిని కలిశాడని తేలింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పుంథూరా నుంచి బయటకు, బయటి నుంచి లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. నిత్యావసరాలను కూడా నేరుగా అధికారులే సరఫరా చేస్తున్నారు. పుంథూరా, తమిళనాడు మధ్య ఫిషింగ్ బోట్ల రాకపోకలను కూడా నిలిపివేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: