తెలుగు అందమైన బాస.. ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్‌ గా పేరు తెచ్చుకున్న భాష. సుందర తెలుంగు అంటూ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి వంటి వారితో ప్రశంసలు పొందిన భాష. అలాగే ప్రతి బాసలోనూ కొన్ని మాండలికాలు ఉంటాయి. వాస్తవానికి ఇవే భాషను సజీవంగా నిలిపి ఉంచుతున్నాయి. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతమేదైనా.. ఆ మాండలిక సొబగులు భాషా ప్రేమికుల్ని ముగ్దులను చేస్తాయి.

 

ఇక ప్రత్యేకించి తెలంగాణ మాండలికం విషయానికి వస్తే.. ఇది చాలా ఏళ్లు అవహేళన చేయబడిందడని తెలంగాణ వారు ఆరోపిస్తుంటారు. తమ భాషను, తమ యాసను ఇతర తెలుగు ప్రాంతాలవారు తక్కువగా చూశారని.. సినిమాల్లో విలన్ పాత్రలకు, కామెడీ పాత్రలకు మాత్రమే తమ మాండలికాన్ని వాడుకుని అవమానపరిచారని వాపోతుంటారు. విచిత్రం ఏంటంటే.. అలా ఒకప్పుడు అవమానాలకు గురైందని భావిస్తున్న తెలంగాణ మాండలికం ఇప్పుడు బుల్లితెరపై రేటింగుల్లో దూసుకుపోతోంది. 

 

IHG


తీన్మార్‌ వార్తలు, జోర్దార్‌ వార్తలు, ఇస్మార్ట్‌ న్యూస్, మాస్ మల్లన్న.. ఇలా ప్రోగ్రామ్‌ పేరు ఏదైనా సరే.. ఇప్పుడు తెలంగాణ మాండలికంలో అందిస్తున్న సెటైర్‌ న్యూస్ ప్రోగ్రాములు రేటింగ్‌ చార్టుల్లో అగ్రభాగాన నిలుస్తున్నాయి. వాస్తవానికి బుల్లి తెరపైనా ఆధిపత్యం ఆంధ్ర ప్రాంతం వారిదే.. అయినా సరే.. రేటింగ్స్ కోసం వారు ఈ ప్రోగ్రామ్ లను ప్రోత్సహిస్తున్నారు కూడా.  


ఇలాంటి మాండలికంతో కూడిన ప్రోగ్రాములకు శ్రీకారం చుట్టింది మాత్రం వీ6 ఛానల్‌ అనే చెప్పాలి. తెలంగాణ భాష, యాస, సంస్కృతిలను మొదటి నుంచి తన విధానంగా ఫీలవుతూ వచ్చిన వీ6 ఛానల్‌కు అసలు గుర్తింపు వచ్చిందే ఈ తీన్మార్‌ వార్తలతో.. మొత్తానికి ఏదేమైనా ఇప్పుడు తెలంగాణ మాంలికం తెలుగు న్యూస్ మీడియాలో కాసులు కురిపిస్తోంది. ప్రజాదరణ పొందుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: