గంగాధర మండలం వెదురుగట్టలో పెంచుతున్న అడవులకు కేసీఆర్ వనంగా పేరు పెట్టాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేసిన ప్రతిపాదనను మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఆమోదించారు.కరీంనగర్‌లో హరితహారం కార్యక్రమానికి తన నిధుల నుంచి రూ.కోటి కేటాయిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నీళ్లతో పాటు పచ్చని చెట్లంటే ఎంతో ఇష్టమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం క‌రీంన‌గ‌ర్‌ కలెక్టరేట్‌లో జ‌రిగిన  సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. గంగాధర మండలం వెదురుగట్టలో పెంచుతున్న అడవులకు కేసీఆర్ వనంగా పేరు పెట్టాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేసిన ప్రతిపాదనను ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నట్టు ప్రకటించారు. 


తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. హరితహారం 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించిన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌కు హరిత‌హారం కార్య‌క్ర‌మం జాతీయ స్థాయిలో తెలంగాణ ప్ర‌భుత్వానికి మంచి పేరు తీసుకువ‌చ్చింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేప‌డుతున్న ఈ కార్య‌క్రమాన్ని అంత‌ర్జాతీయ ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, మీడియాలు కొనియాడాయి. 

 

ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి చేస్తున్న కృషిని వివ‌రిస్తూ అంత‌ర్జాతీయ మీడియాలో క‌థ‌నాలు కూడా ప్ర‌చురితం కావ‌డం గ‌మ‌నార్హం. ఏటా వంద‌ల కోట్ల రూపాయాల‌ను ప్ర‌భుత్వం హరిత‌హారం కోసం ఖ‌ర్చు చేస్తోంది. ఊరూరా న‌ర్స‌రీల‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు ప్ర‌తీ మొక్క సంర‌క్ష‌ణ‌కు ప్ర‌జాప్ర‌తినిధుల‌ను, అధికారుల‌ను బాధ్యులుగా చేస్తూ ఏకంగా పంచాయ‌తీ రాజ్ చ‌ట్టంలో మార్పులు తీసుకురావ‌డం గ‌మ‌నార్హం. అప్ప‌ట్లో ఈ విష‌యం సంచ‌ల‌నం సృష్టించింది. స్వ‌త‌హాగా కేసీఆర్ రైతు కావ‌డంతో ఆయ‌న ప్ర‌కృతి అంటే ఎంతో అభిమానం. ఆ విష‌యం ఆయ‌నే ఎన్నోసార్లు వేదిక‌ల‌పై చెప్పుకొచ్చారు. అట‌వీశాఖ ఆధ్వ‌ర్యంలో కూడా పెద్ద ఎత్తున మొక్క‌లు నాటిస్తూ అడ‌వుల పెంప‌కానికి విశేష‌కంగా కృషి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: