కేసీఆర్ ఎక్కడ.. ఈ ప్రశ్న ఇప్పుడు తెలంగాణలో బాగా వినిపిస్తోంది. తెలంగాణలో కరోనా విపరీతంగా వ్యాపిస్తున్నా కేసీఆర్ సర్కారు పట్టించుకోవడం లేదన్న భావన వ్యాపిస్తోంది. అదే సమయంలో అసలు కేసీఆర్‌ కే కరోనా వచ్చిందంటూ.. వార్తలు వస్తున్నాయి.. ఆయన ప్రగతి భవన్‌లో ఉండటం లేదని.. ఫామ్‌ హౌజ్ నుంచే పాలన సాగిస్తున్నారని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. 

 

ఈ నేపథ్యంలో ఓ యువకుడి కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్ వద్ద కలకలం సృష్టించాడు. ప్రగతి భవన్ ఎదుట ఒక యువకుడు మెరుపు నిరసన తెలిపిన తీరుపై ఒక వార్త వచ్చింది. బైక్‌ పై వచ్చిన ఓ యువకుడు ప్రగతిభవన్‌ ఎగ్జిట్‌ గేటు వద్ద ప్ల కార్డు పట్టుకుని నిరసన తెలిపాడట.  మెరుపు వేగంతో వచ్చి నిరసన తెలిపి మళ్లీ అదే మెరుపు వేగంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడట. 

 

IHG


పోలీసులు అతడిని నిరోధించేందుకు, పట్టుకునేందుకు చాలా ప్రయత్నించినా.. మెరుపు వేగంతో ఆ యువకుడు బైక్ పై వెళ్లిపోయాట. ఇంతకీ ఆ కుర్రాడి చేతిలోని ప్ల కార్డులో ఏముందంటే.. " ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎక్కడ..? ఆయన మా ముఖ్యమంత్రి ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవడం నా హక్కు..’ అని ఆంగ్లంలో రాసి ఉందట. 

 

IHG


ఇక ఇప్పుడు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ.. ఆ యువకుడిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఇప్పటికే కేసీఆర్ ఎక్కడున్నారంటూ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడం సర్కారును కాస్త ఇబ్బంది పెట్టేదే..? 

మరింత సమాచారం తెలుసుకోండి: