అమరావతి ప్రాంతంలో అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ఆరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కొత్తలో చెప్పారు. ఇందుకు రాజధాని ప్రాంతంలో భూమిని కూడా కేటాయించారు. స్మృతి వనం పేరుతో ఆ ప్రాజెక్టు రూపొందించారు. కానీ.. ఐదేళ్లలో ఆ దిశగా అడుగులు పడనే లేదు. అసలు రాజధాని అమరావతి నిర్మాణాలే కొలిక్కి రాలేదు. 

 


పాపం.. ఇక విగ్రహాలు ఏం పెడతాం అనుకున్నారో ఏమో.. మొత్తానికి ఆ ప్రాజెక్టు ఆయన హయాంలో పూర్తి కాకుండానే అలాగే ఉండిపోయింది. అయితే ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక మరోసారి అంబేడ్కర్ విగ్రహం ఆలోచన రూపుదిద్దుకుంటోంది. అసలు జగన్ అమరావతి అనే కాన్సెప్టుకే వ్యతిరేకం కనుక.. అదే అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

 

IHG


స్వరాజ్ మైదానం వేదికగా.. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు జగన్ చకచకా పావులు కదిపారు. అయితే.. ఈ విగ్రహం ఏర్పాటుపై చంద్రబాబు మండిపడుతున్నారు. ఆ విగ్రహం స్మృతి వనంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ కాస్త ఘాటుగానే కామెంట్ చేశారు. 

 


చంద్రబాబు హయాంలో పూర్తి చేయలేని అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పూర్తి చేస్తున్నందుకు టీడీపీ సంతోష పడాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్ వర ప్రసాద్ అంటున్నారు. విగ్రహం ఏర్పాటుకు చంద్రబాబు సహకరించాలని సూచించారు. అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుపై టీడీపీ రాజకీయాలు చేయడం తగదని డొక్కా హితవు పలికారు. విజయవాడ నగరం మధ్యలో విగ్రహాన్ని పెట్టడం సంతోషించవలసిన విషయమన్నారు. పాయింటే కదా..

మరింత సమాచారం తెలుసుకోండి: