రాజు గారు.. అంటే చాలు ఇపుడు మొత్తం చెప్పకుండానే మారుమోగుతున్న పేరు నర్పాపురం ఎంపీ రఘురామక్రిష్ణం రాజు. ఆయన వైసీపీతో కయ్యానికి దిగారు. అధినాయకత్వం కూడా ఆయన మీద లోక్ సభ స్పీకర్ కి ఫిర్యాదు  చేసింది. ఆయన అనర్హత పిటిషన్ స్పీకర్ ఓం బిర్లా పరిశీలనలో ఉంది. ఇవన్నీ ఇలా ఉండగానే రాజు గారిని మరింతగా కార్నర్ చేసే కొత్త వ్యూహానికి వైసీపీ రెడీ అవుతోంది.

 

రాజు గారి ఎంపీగా ఉన్న నర్సాపురం పరిధిలో ఒక్కో వైసీపీ  ఎమ్మెల్యే ఇపుడు ఆయన మీద ఫిర్యాదులు చేస్తున్నారు. నేరుగా పోలీసులకే వాటిని ఇస్తున్నారు. దాంతో రాజుగారి మీద వరసగా కేసులు పడుతున్నాయి. మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే ఇందులో రెండు తప్ప అయిదు వైసీపీ ఎమ్మెల్యేలు గెలుచుకున్నవే. దాంతో వారంతా ఇపుడు ఒక్కొక్కరుగా రాజు గారి మీద ఫిర్యాదు చేస్తున్నారు.

 

ఆయన తమను అసభ్యపదజాలంతో రాజు గారు దూషించారు అంటున్నారు. ఆయన మీద చర్యలు చేపట్టాల‌ని కూడా కోరుతున్నారు. అయితే రాజు గారి మీద యాక్షన్ కి వైసీపీ సర్కార్ రెడీ అవుతోందని, ఈ మొత్తం ఎపిసోడ్ అందులో భాగమేనని అంటున్నారు. అందుకే ఇన్నాళ్ళు సైలెంట్ గా ఎమ్మెల్యేలు ఇపుడు వరస ఫిర్యాదులు చేస్తున్నారు అంటున్నారు.

 

రాజు గారి మీద కంప్లైంటుల పర్వం ముగిసాక ఆయన్ని అరెస్ట్ చేయాలన్నది వైసీపీ ప్లాన్ గా ఉందని అంటున్నారు. దాంతో అలెర్ట్ అయిన రాజు గారు మరో మారు కేంద్రం ద్రుష్టికి ఈ సమస్యను తెస్తారని అంటున్నారు. ఆయన్ని కేంద్రం ఆదుకుంటుందా లేదా చూడాలి. ఇప్పటికే ఆయన తనకు కేంద్ర బలగాలు రక్షణగా ఉండాలని అంటున్నారు. ఈ నేపధ్యంలో రాజు గారు మళ్లీ ఢిల్లీ వైపు చూస్తున్నారుట. ఒక వేళ అనూహ్య పరిస్థితుల మధ్య రాజు గారు అరెస్ట్ అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కాక రేగడం ఖాయమని అంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: