దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వైరస్ విజృంభణ వల్ల కొందరు ఆస్పత్రులకు పరిమితమవుతుంటే మరికొందరు ఆర్థికంగా దెబ్బతింటున్నారు. దేశంలో గత 24 గంటల్లో 24,879 మంది కరోనా భారీన పడగా 487 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో కరోనా రికవరీ రేటు 62 శాతంగా ఉండగా మృతుల సంఖ్య 21,129కు చేరింది. 
 
అయితే కరోనా వైరస్ గురించి చేస్తున్న ప్రయోగాల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా క్షీణిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి త్వరలో భారత్ తో పాటు ఇతర దేశాల్లో కూడా వైరస్ అంతమవుతుందని అభిప్రాయపడుతున్నారు. 
 
ఇటాలియన్ అంటువ్యాధుల స్పెషలిస్ట్ మేటియో బసెట్టి వైరస్ రోజురోజుకు బలహీనపడుతోందని... ఇదే పరిస్థితి కొనసాగితే వ్యాక్సిన్ లేకుండానే వైరస్ అంతమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గతంతో పోలిస్తే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని.... సెప్టెంబర్ 19 నాటికి వైరస్ పూర్తిగా అంతమవుతుందని పలు జర్నల్స్ లో కథనాలు ప్రచురిచమవుతున్నాయి. 
 
ఆస్పత్రుల్లో కూడా కరోనా రోగులకు సాధారణ మందులనే వినియోగిస్తున్నా కోలుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం కరోనా రోగులను ఆస్పత్రుల్లో 3 నుంచి 5 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తున్నారు. అతి త్వరలో వైరస్ పూర్తిగా అంతమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతూ ఉండటం శుభ పరిణామం అని చెప్పవచ్చు. మరోవైపు పలు దేశాల్లో కరోనా వైరస్ నియంత్రణ కోసం తయారు చేస్తున్న వ్యాక్సిన్లు సత్ఫలితాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.                   

మరింత సమాచారం తెలుసుకోండి: