కరోనా వైరస్ గురించి వినబడుతున్న రోజుకో వార్త ఉన్న కొద్ది మనిషిలో భయాన్ని పెంచుతుంది. జీవితంపై ఏమాత్రం నిరీక్షణ లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో పేదవాడు మొదలుకొని దేశ ప్రధాని వరకు అనేక రీతులగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి మాత్రమే సోకుతుందని తెలిపిన శాస్త్రవేత్తలు తాజాగా గాలి ద్వారా కూడా మనిషికి సోకుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించినట్లు ఇటీవల వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో చాలావరకు ప్రజలు ఇంకా గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతూ ఉంటే మనమేం చేయగలం దీన్ని నిర్మూలించాలంటే దేవుడే కిందకి దిగి రావాలి అనే పరిస్థితి ఏర్పడింది. మనిషి నుండి మనిషికి సోకె పరిస్థితి అయితే మాస్కు లు శానిటైజర్ లు వాడి మెయింటైన్ చేయవచ్చు.

 

కాని గాలిలో కూడా అంటే వైరస్ నుండి తప్పించుకోవటం కష్టమని ప్రజలు అంటున్నారు. పూర్తి మేటర్ లోకి వెళితే ఇటీవల 32 దేశాలకు 239 మంది శాస్త్రవేత్తలు కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా లేదా అని పరిశోధనలు చేశారట. అయితే చేసిన పరిశోధనలో గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధారణ అయిందని తెలుసుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి నివేదిక అందజేయడం జరిగింది. అయితే మొదటి లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి ద్వారా వ్యాప్తి లేదని కొట్టి పారేయడం జరిగింది. అయితే ఇటీవల కొన్ని కేసులు మరియు అప్పట్లో శాస్త్రవేత్తలు నిర్వహించిన ప్రయోగాలు నిర్ధారించిన నివేదిక పరీక్షించి క్షుణ్ణంగా తెలుసుకుంటే కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒప్పుకోవటం జరిగింది.

 

ఇదిలా ఉండగా ఇది అత్యంత భయంకరమైనది ఏం కాదని, గాలి ద్వారా వ్యాప్తి చెంది ప్రతి ఒక్కరికి వస్తుందనే విషయంలో నిజం లేదని వారు పేర్కొన్నారు. అంత బలంగా గాలి ద్వారా వైరస్ వ్యాపించిన మనిషిపై అంత ప్రభావం చూపించదు అని… ఇది కొన్ని పరిశోధనలు చేస్తే అప్పుడు నిర్ధారణ అవుతుందని ఏది ఏమైనా మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడంను మరింత కఠినంగా అనుసరించడం ద్వారా దీన్ని అడ్డుకోవచ్చు అంటూ డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: