ఏపీలో అధికార వైసీపీ ఫుల్ ఆధిపత్యం చెలాయిస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో వైసీపీ పవర్ కాస్త కూడా తగ్గలేదు.  అయితే ఇదంతా జగన్ వల్లే అని స్పష్టంగా కనబడుతోంది. కొందరు ఎమ్మెల్యేలు సరైన పనితీరు కనబర్చకపోయినా కూడా జగన్ పాలన వల్ల, వైసీపీ వీక్ కావడం లేదు. అయితే ఇక్కడవరకు అంతా బాగానే ఉన్నా, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల బలం మాత్రం తగ్గించలేకపోతున్నారు.

 

అధికారంలో ఉండి కూడా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలకు వైసీపీ నేతలు చెక్ పెట్టలేకపోతున్నారు. ముఖ్యంగా మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప విషయంలో వైసీపీ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. దశాబ్దాల పాటు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా పనిచేసిన రాజప్ప, 2014 ఎన్నికల్లో పెద్దాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

 

ఇక ఎన్నో ఏళ్ళు పార్టీ కోసం కష్టపడటంతో చంద్రబాబు...రాజప్పకు హోమ్ మంత్రి పదవితో పాటు, డిప్యూటీ సీఎంని చేశారు. ఆ ఐదేళ్లు మంచిగానే పదవి బాధ్యతలు నిర్వర్తించిన రాజప్ప, ఎమ్మెల్యేగా పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అలా చేయడం వల్లే, 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నా సరే, రాజప్ప పెద్దాపురం బరిలో మళ్ళీ గెలిచి సత్తా చాటారు. వైసీపీ నుంచి పోటీ చేసి తోట వాణి ఓటమి పాలయ్యారు.

 

ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా రాజప్ప, నియోజకవర్గంలో బాగానే పనిచేసుకుంటున్నారు. నిధులు అందకపోయినా, తనకు సాధ్యమైన మేర ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. అటు ఎన్నికల్లో ఓడిపోయిన తోట వాణి సైలెంట్ కావడంతో, నియోజకవర్గం బాధ్యతలని దవులూరి దొరబాబు చూసుకుంటున్నారు. దొరబాబు కూడా పెద్ద ఎఫెక్టివ్‌గా పనిచేయడం లేదని తెలుస్తోంది. ఇప్పటికీ పెద్దాపురం ప్రజలు రాజప్ప వైపే ఉన్నారని అర్ధమవుతుంది. మొత్తానికైతే అధికారంలో ఉన్నా సరే వైసీపీ నేతలు రాజప్ప బలాన్ని ఏ మాత్రం తగ్గించలేకపోయారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: