దేశంలో ప్రస్తుతం యాప్‌ల బ్యాన్‌ పర్వం నడుస్తోంది. ఇప్పటికే టిక్‌టాక్‌ యాప్‌తో సహా 59 చైనీస్‌ యాప్‌లను బ్యాన్‌ చేసిన కేంద్రం బాటలో ఇండియన్‌ ఆర్మీ నడిచింది.   ఫేస్‌బుక్‌ సహా 89 యాప్‌లను నిషేధించాలని సైనికాధికారులను ఆర్మీ ఆదేశించింది. దేశభద్రతతో పాటు  సైనికుల శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని ఇండియన్‌ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన యాప్స్‌ను తమ మొబైల్స్‌ నుంచి తొలగించాలని సైనికులతో పాటు సైనికాధికారులను ఆర్మీ ఆదేశించింది. ఇటీవల కేంద్రం నిషేధించిన 59 చైనా యాప్స్‌తో పాటు  ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌లపై కూడా ఆర్మీ బ్యాన్ విధించింది.

 

స్మార్ట్‌ ఫోన్ల ద్వారా చైనా, పాక్‌కు చెందిన ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు గూఢచర్యం చేస్తున్నట్టు తేలడంతో సైన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో పాటు జూమ్‌, స్నాప్‌చాట్, టిండర్, రెడిట్‌, పబ్‌జీ వంటి 89 యాప్స్‌ను ఇకపై సైన్యం ఉపయోగించకుండా ఆదేశాలు జారీ చేసింది. నిషేధించిన 89 ర‌కాల యాప్‌ల నుంచి ఆర్మీ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇందుకు సంబంధించి భార‌త ఆర్మీ 89 యాప్‌ల జాబితాను విడుద‌ల చేసింది. ఆర్మీలో ప‌ని చేస్తున్న సైనికులు జులై 15వ తేదీలోగా నిషేధించిన యాప్‌ల అకౌంట్స్‌ను తొల‌గించాల‌ని ఆదేశించింది. అలా చేయ‌ని వారిపై క‌ఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

 

భార‌త‌-చైనా స‌రిహ‌ద్దు గాల్వాన్ లోయ‌లో చోటుచేసుకున్న ఘర్షణలో డ్రాగ‌న్ కంట్రీ కార‌ణంగా మ‌న జ‌వాన్లు 20 మంది మ‌ర‌ణించారు. ఈ విష‌యంలో సీరియ‌స్ అయిన మోడీ స‌ర్కార్.. చైనా యాప్‌ల‌ను నిషేధించింది. ఇప్పుడు ఇదే బాట‌లో ఇండియ‌న్ ఆర్మీ కూడా న‌డిచింది.

 

మొత్తానికి ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సైనికుల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న డెసిషన్ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయాన్ని సైనికులు పాటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: