దేశంలో సంక్షేమ పథకాలు అందించే సీఎంల్లో ఎవరు టాప్‌లో ఉన్నారంటే? ఏ మాత్రం అనుమానం లేకుండా ఏపీ సీఎం జగన్ పేరు చెప్పేయొచ్చు. అసలు సంక్షేమ పథకాలు అమలులో దేశంలో ఏ సీఎం కూడా జగన్ దరిదాపుల్లో లేరనే చెప్పొచ్చు. ఓ రకంగా చెప్పాలంటే తన తండ్రి దివంగత వైఎస్సార్ కంటే మిన్నగానే జగన్ ప్రజలకు పథకాలు అందిస్తున్నారు.

 

అధికారంలోకి వచ్చి ఏడాదే దాటింది. కానీ ఈలోపే 80 శాతం పైనే హామీలు అమలు చేశారు. అసలు ప్రజలపై వరుస పెట్టి సంక్షేమ జల్లులు కురిపించారు. పైగా చెప్పిన సమయానికి చెప్పిన విధంగా పథకాలు అందించారు. అసలు జగన్ ఇచ్చిన పథకాలు ఏపీలోని దాదాపు 3 కోట్ల మందికి అందాయి. ఇక ఇలా ఇవ్వడం వల్ల మెజారిటీ ప్రజలు జగన్ వైపే ఉన్నారు. ఇంకా ఎక్కువగా జగన్‌కు సపోర్ట్ ఇస్తున్నారు.

 

ఇక ఈ సపోర్ట్ ఉండటం వల్లే, జగన్ ఏడాది పాలనపై జరిగిన సర్వేలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అయితే జగన్ ఇంతటితో ఆగిపోకుండా ఇంకా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ అసలు మేటర్ పట్టుకున్నారు. ఎవరి వల్ల అయితే ప్రభుత్వాలు మారిపోతాయో, వారికే జగన్ మేలు కలిగేలా చేస్తున్నారు. రాష్ట్రంలో కీలకంగా ఉన్న డ్వాక్రా మహిళల రుణమాఫీ చేయడానికి జగన్ సిద్ధమయ్యారు.

 

గతంలో చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి, ఆ హామీని అమలు చేయకుండా, ఎన్నికల ముందు పసుపు-కుంకుమ పేరిట 10 వేలు వేశారు. దీంతో డ్వాక్రా మహిళలు బాబుకు గట్టి షాక్ ఇచ్చి, జగన్‌కు మద్ధతు తెలిపారు. ఇక ఇప్పుడు జగన్ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడంతో, డ్వాక్రా మహిళలు ఆనందంగా ఉన్నారు. కరెక్ట్‌గా ఇబ్బందులు ఉన్న సమయంలో జగన్ రుణమాఫీ చేయడానికి సిద్ధం కావడం మంచి పరిణామం అని, ఇది జగన్‌కు చాలా అడ్వాంటేజ్ అవుతుందని, రుణమాఫీ పూర్తిగా అమలు చేస్తే,  నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌కు తిరుగుండదని విశ్లేషుకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: