ఏపీ రాజకీయాలు ఎప్పుడు కులాల ఆధారంగానే నడుస్తాయనే సంగతి తెలిసిందే. అందులోనూ కమ్మ, రెడ్డి సామాజికవర్గాలే రాష్ట్ర రాజకీయాలని నడిపిస్తాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఏపీలో ఇదే పరిస్తితి కొనసాగుతుంది. టీడీపీ అధికారంలో ఉంటే కమ్మ వారు ఆధిపత్యం చెలాయిస్తారు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉంటే రెడ్డి సామాజికవర్గ డామినేషన్ నడుస్తోంది. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి...రెడ్డి కులం ఆధిక్యం ఉంది.

 

అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ వారు ఏ మాత్రం మొహమాటం పడకుండా కావాల్సిన పనులు చేయించుకుంటారు. అసలు ఎమ్మెల్యేల కంటే వీరే అధికారులని నడిపిస్తారు. గత ఐదేళ్లు ఏపీలో అదే జరిగింది. కానీ ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో కమ్మ సామాజికవర్గం పప్పులు ఉడకటం కష్టమని, పూర్తిగా రెడ్డి డామినేషన్ ఉంటుంది కాబట్టి, వారికి ఎలాంటి పనులు జరగవని అనుకుంటారు.

 

కానీ పరిస్థితులు ఎలా ఉన్నా వారి పనులు మాత్రం ఆగవని తెలుస్తోంది. మరీ టీడీపీ అంటే అభిమానం ఉన్న కమ్మవారిని పక్కనబెట్టేస్తే, అవసరం కోసం అటు ఇటు గంతులేసే వారు మాత్రం వైసీపీతో బాగానే అంటకాగుతున్నారని తెలుస్తోంది. సైలెంట్‌గా తమకు కావాల్సినవి చేయించుకోవడం కోసం, పలు నియోజకవర్గాల్లో పరోక్షంగా వైసీపీ ఎమ్మెల్యేలకు మద్ధతు ఇస్తున్నట్లు సమాచారం. గుంటూరు, కృష్ణా జిల్లాలో కమ్మ సామాజికవర్గం వారు ఎక్కువ ఉంటారనే సంగతి తెలిసిందే.

 

ఇక ఈ రెండు జిల్లాల్లో చాలామంది, తమ పనులు చేయించుకోవడం కోసం వైసీపీ ఎమ్మెల్యేల వెనుక తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పైకి ఏమో టీడీపీ నాయకులగానే చెలామణి అవుతూ....వెనుక మాత్రం వైసీపీకి సపోర్ట్ ఇస్తూ, కమ్మని రాజకీయం చేస్తున్నారు. అవసరం బట్టి నడుచుకుంటూ, టీడీపీకి డ్యామేజ్ చేస్తూ, పరోక్షంగా జగన్‌కు అన్నివిధాలా మద్ధతు పలుకుతున్నారు. అయితే ఇప్పుడు ఇలా వైసీపీకి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వారు, నెక్స్ట్ టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం, వెంటనే అక్కడ ఇష్టారాజ్యంగా ఆధిపత్యం చెలాయిస్తారు. ఇక వీరి వల్లే మొన్న ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ జరిగిందని నిజమైన తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: