2019 ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేసి ఉంటే, వైసీపీకి 151 సీట్లు వచ్చేవి కాదా? అంటే ఖచ్చితంగా కాదని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. ఎన్నికల ముందు జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి, వైసీపీకి నష్టం జరుగుతుందని కొందరు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా టీడీపీ ఓట్లు జనసేన చీల్చి, ఆ పార్టీకే పెద్ద డ్యామేజ్ జరిగింది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన భారీగా ఓట్లు చీల్చింది.

 

ఈ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులు టీడీపీ అభ్యర్ధుల మీద గెలిచిన మెజారిటీ కంటే, జనసేన అభ్యర్ధులు ఎక్కువగానే ఓట్లు తెచ్చుకున్నారు. ఒకవేళ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే ఆయా నియోజకవర్గాల్లో వైసీపీకు గెలుపు దక్కేది కాదు. టీడీపీ-జనసేనలకు కలిపి ఒక 50-60 సీట్లు వచ్చేవి. అప్పుడు వైసీపీ మెజారిటీ తగ్గేది. అలాగే పవన్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల గెలిచేవారు.

 

కానీ 2019 ఎన్నికల్లో అలా జరగలేదు. కాబట్టి టీడీపీ-జనసేనలు ఘోరంగా ఓడిపోయి, వైసీపీకి అదిరిపోయే మెజారిటీ వచ్చింది. అయితే భవిష్యత్‌లో అలాంటి తప్పు జరగకుండా ఉండాలంటే, పవన్‌ని కలుపుకుంటూనే బాగుంటుందని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేయకపోతే జగన్‌కు చెక్ పెట్టడం కష్టమని, మళ్ళీ ఆయనే సీఎం అయిపోతారని చెబుతున్నారు.

 

ఒకవేళ ఈ నాలుగేళ్లలో టీడీపీ పుంజుకున్న కూడా జగన్‌ని భారీ తేడాతో ఓడించలేదని, ఏదో కాస్త పోటీ మాత్రం ఇవ్వగలదని, అప్పుడు జనసేన సెపరేట్‌గా బరిలో ఉంటే, మళ్ళీ టీడీపీకి నష్టం జరిగి, ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ దక్కించుకుని జగన్ మళ్ళీ సీఎం పీఠంలో కూర్చోడం ఖాయమని అంటున్నారు. అదే టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తే మంచి ఫలితం రావోచ్చని, అన్నీ అనుకున్నట్లు జరిగితే మ్యాజిక్ ఫిగర్ నెంబర్‌ని దక్కించుకుని అధికారం దక్కిచుకునే అవకాశాలున్నాయని తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: