అధికార కాంక్ష‌తో ర‌గులుతూ, స‌రిహ‌ద్దు వివాదాల‌ను పెంచిపోషిస్తున్న డ్రాగ‌న్ కంట్రీకి షాక్‌లు త‌గులుతున్నాయి. ఆ దేశం తీరుపై ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాలు భ‌గ్గుమంటున్నాయి. ప్ర‌ధానంగా భార‌త్ విష‌యంలో చైనా తీరుపై గ‌ర్హిస్తున్నాయి. ఈ విష‌యంలో మ‌న‌కు అంండ‌గా ఉంటున్న చైనా ఇంకో షాక్ ఇచ్చింది. చైనా దూకుడు చర్యలకు సంబంధించి అనేకసార్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో మాట్లాడానని  అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు. చైనా దూకుడు చర్యల పట్ల  భారతీయులు చాలా బాగా స్పందించారని ఆయ‌న కితాబు ఇచ్చారు. ఇది కేవ‌లం ప్ర‌ధాన‌మంత్రికే కాకుండా భార‌తీయులుగా మ‌నకు ద‌క్కిన స‌మిష్టి గౌర‌వ‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

 

ఇదిలాఉండ‌గా, అమెరికా అత్యున్న‌త ద‌ర్యాప్తు సంస్థ‌ ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్(ఎఫ్‌బీఐ) చైనాను ఇరికించేందుకు శ‌తవిధాల ప్ర‌య‌త్నిస్తోంది. వాషింగ్ట‌న్‌లోని హ‌డ్స‌న్ ఇన్స్‌టిట్యూట్‌లో ఎఫ్‌బీఐ డైర‌క్ట‌ర్ క్రిస్టోఫ‌ర్ వ్రే మాట్లాడుతూ ప్ర‌పంచ‌దేశాల‌కు హెచ్చ‌రిక‌లు చేశారు. సూప‌ర్ ప‌వర్ కావాల‌న్న ఉద్దేశంతోనే చైనా అన్ని ర‌కాల త‌ప్పుడు ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. ఏదైనా చేసి అత్యంత శ‌క్తివంతంగా త‌యారు కావాల‌న్న దీక్ష‌తోనే చైనా భిన్న ప‌ద్ధ‌తుల‌ను వాడుతున్న‌ట్లు ఆయ‌న హెచ్చ‌రించారు.   చైనాకు చెందిన క‌మ్యూనిస్టు పార్టీ ఈ ర‌క‌మైన ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు వ్రే ఆరోపించారు.

 

చైనా చేప‌డుతున్న ప్రాప‌ర్టీ, ఇంట‌లెక్చువ‌ల్ చోరీ వ‌ల్ల అమెరిక‌న్లు ఎక్కువ శాతం బాధితులు అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఎఫ్‌బీఐ చీఫ్‌ హెచ్చ‌రించారు. ఎఫ్‌బీఐ వ‌ద్ద సుమారు అయిదు వేల‌కు పైగా కౌంట‌ర్ ఇంటెలిజెన్స్ కేసులు ఉన్నాయ‌ని, వాటిల్లో సగం కేసులు చైనాకు లింకై ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. విద్యావేత్త‌లు, జ‌ర్న‌లిస్టులు, అమెరికా మీడియాపైన కూడా  చైనా వ‌త్తిడి తెస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. కోవిడ్‌19 నియంత్ర‌ణ‌లోనూ చైనాకు అండ‌గా ఉండాల‌ని ఆ దేశ ప్ర‌తినిధులు అమెరికాపై వ‌త్తిడి తీసుకువ‌స్తున్న‌ట్లు తెలుస్తోంద‌న్నారు. చైనా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు వ‌ల్ల అమెరికా వాణిజ్యం దెబ్బ‌తిన‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. కాగా, ఎఫ్‌బీఐ కామెంట్ల‌తో ‌చైనాపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనుమానాలు పెరుగుతాయ‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: