తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బయటపడిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన అన్ని మీడియా సమావేశాలు దేశంలో మరే ముఖ్యమంత్రి నిర్వహించలేదు.  అవసరమైతే ముఖానికి మాస్క్ లేకుండా మొత్తం ఎమ్మెల్యేలంతా ప్రజల ప్రాణాలను కాపాడటానికి కరోనా వైరస్ కి ఎదురుగా వెళ్తాం. వెయ్యి కోట్లు ఖర్చు అయినా దాన్ని తెలంగాణ రాష్ట్రంలో రానివ్వను అంటూ తెగ చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఇప్పుడు విలయతాండవం చేస్తోంది. ఏకంగా తెలంగాణ సచివాలయంలో కూడా కరోనా వైరస్ బారిన పడిన వాళ్ళు ఉన్నారు. మంత్రులకు చికిత్స చేస్తున్న వైద్యులకు అదేవిధంగా ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం రోడ్డు మీద విధులు నిర్వహిస్తున్న పోలీసులకి కూడా సోకే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందడం కాదు ప్రళయం లాగా తెలంగాణ వాసులను పగబట్టినట్లు భయంకరంగా వ్యాప్తి చెంది ఉంది.

 

రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన బాధితులను కనీసం ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ముఖ్యంగా హైదరాబాదు నగరంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాపించి ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయాలి అంటే ప్లాస్మా థెరపీ యే ఏకైక మార్గమని… చాలా వరకు సత్ఫలితాలిస్తున్న తరుణంలో తెలంగాణ సర్కార్ ప్లాస్మా థెరపీ చికిత్స విధానం పై ఆధారపడింది. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. కానీ ఒక్కరు కూడా  తెలంగాణ ప్లాస్మా దానం చేసేందుకు వాలంటీర్లుగా ఇవ్వటానికి ముందుకు రావడం లేదట.

 

గత నాలుగు నెలల్లో కేవలం 19 మంది మాత్రమే ప్లాస్మాను దానం చేశారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో  దాదాపు 30 వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 17,279 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. మరో 324 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 11,933 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈ తరుణంలో ఇతర మనుషుల ప్రాణాలను కాపాడటానికి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేయటానికి ముందుకు రాకపోవటంతో తెలంగాణ ప్రభుత్వానికి ఇది పెద్ద కష్టం గా మారింది. ప్లాస్మాను దానం చేసే వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది అని ప్రకటించిన ప్రజలు ఎవరూ ముందుకు రావటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: