కరోనా కర్ణాటక ను వణికిస్తోంది. గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులెటిన్ ద్వారా మీడియాకు తెలియ చేయడం జరిగింది. ఈ హెల్త్ బులిటెన్ పరంగా చూస్తే... నేడు ఏకంగా 2228 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 30 వేల మార్కును దాటింది. నేటితో మొత్తం కేసుల సంఖ్య 31105 కు చేరుకుంది. ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 17782 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఇందులో 457 మందికి కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. 

 

 

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఏకంగా 957 మంది కరోనా నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 12833 కు చేరుకుంది. అలాగే నేడు రాష్ట్రవ్యాప్తంగా 17 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో నేటి వరకు రాష్ట్రంలో మరణాల సంఖ్య 486 చేరుకుంది. 

 

ఇక కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తుంది అని చెప్పవచ్చు. నేడు ఏకంగా 1373 కేసులు బెంగుళూరు మహానగరంలోని నమోదవడంతో నగర ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: