భారత్ బలహీనతలు ఎపుడూ పొరుగుదేశానికే తెలుస్తాయి. అది పాకిస్థాన్ అయినా చైనా అయినా ఒక్కటే. వారు అందుకే తెలివిగా ఒడుపుగా వీటిని వాడుకుంటారు. దానికి కారణం దేశంలో రాజకీయాలని చెప్పాలి. ఈ రాజకీయాలు దిగజారిపోయాయి. ఎంతలా అంతే  బయట శత్రువుని ఎంచక్కా వదిలేసి ఇంట్లో ఉన్న అన్నదమ్ముడి గుండెల్లో కత్తులతో పొడవడం.

 

మన రాజకీయం బాగుంటే చాలు. తరువాత మిగతావన్నీ. ఈ ధోరణి దేశభక్తి అంటూ జబ్బలు చరుస్తున్న బీజేపీలో కూడా ప్రబలడమే ఇపుడు అసలైన విషాదం. చైనా తో సరిహద్దు ఘర్షణల విషయంలో  అసలు వ్యవహారాలు  ఈ దేశానికి తెలియాల్సిఉంది. వాటిని బయటపెట్టాల్సిన బాధ్యత కేంద్రానిది. అడగాల్సిన బాధ్యత కాంగ్రెస్ కి ఉంది.

 

కాంగ్రెస్ అంటే ఆష్టామాషీ పార్టీ కాదు, ఈ రోజు బీజేపీ రెండు సార్లు పూర్తి మెజారిటీతో గెలవవచ్చు కానీ కాంగ్రెస్ ఎన్నో సార్లు అలా గెలిచింది. అర్ధ శతాబ్ధం పైగా ఈ దేశాన్ని ఏలిన  గ్రాండ్ ఓల్డ్ పార్టీ, ఈ దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర చాలా ఎక్కువ. అటువంటి పార్టీ చైనా సంగతేంటి అని అడిగితే కేంద్రంలోకి బీజేపీ పాలకులకు కోపం వచ్చింది. ఇక చైనా నుంచి పీఎం కేర్  కి విరాళాలు దండీగా వచ్చాయని కాంగ్రెస్ ఆరోపించింది.

 

అంతే ఆ కోపంతో గాంధీలకు చెందిన ట్రస్టుల మీద ఇపుడు కేంద్రం కొరడా ఝలిపించింది. ఆ ట్రస్టులకు వచ్చిన డబ్బు ఎక్కడిది, మనీ లాండరింగ్ ద్వారా వస్తంది. చైనా సహా అనేక దేశాల నుంచి అక్రమంగా వస్తోంది అంటూ బీజేపీ ఆరోపిస్తోంది. దీని మీద ఇపుడు భారీ ఎత్తున విచారణకు దిగుతోంది. మరి ఇలా ఒక దేశంగా చైనా లాంటి వారి మీద పోరాడాల్సిన వేళ రాజకీయ లాభాల కోసం కాట్లాడుకుంటూ నీకు చైనా డబ్బులు ఇచ్చిందంటే నీకు ఎక్కువ ఇచ్చింది అనుకొవడం ద్వారా ఇద్దరూ చైనాని గెలిపించేస్తున్నారు. మరి అసలు  సంగతి మరచిన వారు ఇలా రాజకీయాలకు దిగడం విషాదమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: