కేరళలో రోజు రోజుకు పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. ఇటీవల విదేశాల నుండి అలాగే పక్క రాష్ట్రాల నుండి వచ్చినవారి వల్ల ఆరాష్ట్రంలో ప్రస్తుతం కాంటాక్ట్ కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుండి తీర ప్రాంతమైన పూంతురాలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. అక్కడి ఫిష్ మార్కెట్ లో ఓ వ్యక్తికి  పాజిటివ్ రావడంతో అతని నుండి చాలా మందికి కరోనా సోకింది. దాంతో  పూంతురాను మొదటి సూపర్ స్ప్రెడింగ్ ఏరియా గా గుర్తించారు.
 
ఇక కేరళ సీఎం విజయన్ కూడా రాష్ట్రంలో సామజిక వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇదిలావుంటే ఈ ఒక్కరోజే  కేరళలో రికార్డు స్థాయిలో 339 కేసులు నమోదయ్యాయి. ఇందులో 140 కాంటాక్ట్ కేసులే కావడం గమనార్హం.  ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 6534కు చేరగా అందులో ప్రస్తుతం 2795 కేసులు యాక్టీవ్ గా వున్నాయి కాగా 3711మంది బాధితులు కోలుకోగా కరోనాతో 28మంది మరణించారు.
ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి అందులో భాగంగా తమిళనాడులో 4231 కేసులు నమోదు కాగా కర్ణాటకలో రికార్డు స్థాయిలో 2228 కేసులు నమోదయ్యాయి అలాగే  తెలంగాణలో కొత్తగా 1410కేసులు నమోదు కాగా  ,ఆంధ్రప్రదేశ్ లో 1555కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా చూసుకుంటే దేశంలో కరోనా కేసుల సంఖ్య 780000 దాటగా 21500 మరణాలు చోటుచేసుకున్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: