జగన్ ఏపీ సీఎం, హాయిగా పాలన చేసుకుంటున్నారు. ఇక కేసీయార్ తెలంగాణా సీఎం. ఆరేళ్ళుగా పాలిస్తున్నారు. పైగా ఆయన అనుభవం, రాజకీయం వేరు. ఆయన పార్టీతో జగన్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. కేసీయార్ తో మంచి దోస్తీనే జగన్ చేస్తున్నారు. అలాటపుడు కేసీయార్ కి జగన్ ఎదురునిలవడం అంటే జరిగే పనేనా.

 

కానీ ఇది రాజకీయం. ఎపుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. మిత్రులు శత్రువులు అవుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. అందువల్ల ఏదైనా  జరగవచ్చు. అసలే నీటి తగాదాలు రెండు రాష్ట్రాల మధ్య ఉన్నాయి. ఈ మధ్య ఇద్దరు మిత్రులు అసలు కలవడం లేదు. దాంతో దూరం పెరిగింది అంటున్నారు.

 

ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణాలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఈ మధ్య గట్టిగా జరిగాయి. గతంతో పోలిస్తే ధూం ధాం గా జరిగాయి. దానికి కారణం ఏంటి అంటే అక్కడ కాంగ్రెస్ నాయకులు వైఎస్సార్ అని అదే పనిగా  కలవరిస్తున్నారు. వారికి ఆయన మళ్లీ అంతలా గుర్తుకువచ్చారు. వైఎస్సార్  దూరమై ఇప్పటికి 11 ఏళ్ళు అయింది. అయినా అంతా తలచుకుంటారు.

 

అయితే ఏపీ కాంగ్రెస్ నాయకుల కంటే కూడా తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఈసారి బాగా వైఎస్సార్ జయంతిని చేసారు. దానికి కారణం ఉందంటున్నారు. అదంతా వైఎస్ జగన్ని ప్రసన్నం చేసుకోవడానికట. ఏకంగా తెలంగాణా పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి జగన్ భేష్ అంటున్నారు. అలాగే కాంగ్రెస్ లో ప్రముఖ నాయకుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి సైతం జై జగన్ అంటున్నారు.

 

వీరంతా ఒకపుడు వైఎస్సార్ కి అనుచరులుగా ఉండేవారు. ఆ తరువాత జగన్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోవడం, విభజన తరువాత ఏపీకి పరిమితం కావడంతో ఆయన సీఎం అయ్యారు. ఇక జగన్ చరిష్మా కూడా ఇపుడు బాగా ఉంది. అందువల్ల జగన్ని పొగిడి ఆయన ద్వారా తెలంగాణా కాంగ్రెస్ రాజకీయానికి జవసత్వాలు కల్పించాలని రెడ్లు అనుకుంటున్నారుట. అదీ కాకపోతే తెలంగాణాలో వైసీపీని యాక్టివ్ చేసి అందులో చేరి జగన్ ఇమేజ్ తో అక్కడ జెండా పాతాలని కూడా చూస్తున్నారుట. 

 

జగన్ 2014 ఎన్నికల తరువాత తెలంగాణాలో పోటీ చేయేలేదు, ఆయన మొదటి చూపు ఏపీ మీద ఉంది. ఇపుడు ఏపీలో అధికారం దక్కింది కాబట్టి తెలంగాణాలో పార్టీ విస్తరిస్తారని అంటున్నారు. అలా చేస్తేఎ  అక్కడ కూడా కాంగ్రెస్ దుకాణం మూసేసి చేరాలని చాలా మంది నాయకులు  చూస్తున్నారు. అదే కనుక జరిగితే మంచి పోటీ ఇచ్చేందుకు జగన్ రెడీ అవుతారు. అది కేసీయార్ కి ఇబ్బందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: