ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా  వైరస్ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్న తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రులన్ని  కరోనా రోగుల తో నిండి ఉన్నాయి. అటు క్వారంటైన్ సెంటర్లు కూడా కరోనా  కరోనా అనుమానితులతో  పూర్తిగా నిండిపోయాయి. దీంతో ప్రభుత్వాసుపత్రుల తోపాటు ప్రత్యామ్నాయ చర్యలపై ప్రభుత్వాలు దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులు కరోనా  చికిత్సకు తీసుకోవాల్సిన ధరను తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా  పేషెంట్లకు ప్రభుత్వాసుపత్రుల నిండిపోతున్న తరుణంలో ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా కరోనా  చికిత్స అందించేలా ఆ చికిత్సకు ఒక ప్రత్యేకమైన ధర ఉండేలా నిర్ణయం తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్ . 

 

 ప్రైవేట్ ఆస్పత్రిలో  వెంటిలేటర్ ఎన్ఐవి  లేకుండా రోజువారి కరోనా  చికిత్సకు 3200... ఐసీయూలో చికిత్స పొందుతుంటే రోజుకి 5400 రూపాయలు... ఎన్ఐవి ఉండి ఐసీయూలో చికిత్స పొందుతూ ఉంటే 5980 రూపాయలు.. వెంటిలేటర్ ఉండి ఐసీయూలో చికిత్స పొందుతూ ఉంటాయి.. 9800, వెంటిలేటర్ ఉండి  సెప్టిక్ షాక్ చికిత్స చేస్తే 10300 రూపాయలను ప్రైవేట్ ఆసుపత్రులు తీసుకోవాల్సిందిగా జగన్ సర్కారు నిర్ణయించింది. అంటే ప్రస్తుతం జగన్ సర్కార్ నిర్ణయించిన లెక్కల ప్రకారం ఒకవేళ కరోనా  వైరస్ చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో ఉంటే పది రోజులకు ఏకంగా లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది, 

 


 అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరలను నిర్ణయించినప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రిలు  మాత్రం ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి లక్షలకు లక్షలు వసూలు చేసింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటివి జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే నిర్లక్ష్యంగా వ్యవహరించి లక్షలకు లక్షలు ప్రైవేటు ఆసుపత్రులకు కుమ్మరించే బదులు ఎంతో జాగ్రత్తగా ఉండి కరోనా వైరస్ దరిచేరకుండా ఉంటే ఎంతో మేలు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు అలా అని ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే ఫీజు చెల్లించలేక ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఇప్పటికైనా అందరూ అప్రమత్తంగా ఉంటే మంచిది అని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: