చైనా ప్రస్తుతం విస్తరణ వాదంతో ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. కనిపించిన భూభాగమంతా మాదే అంటూ ప్రగల్భాలు పలుకుతూ చైనా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో చైనా  ప్రభుత్వం ఎన్నో దేశాలతో వివాదాలు కూడా పెట్టుకుంది. ప్రస్తుతం భారత్ తో  వివాదం కూడా  ఇలాంటి  సంబంధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గతంలో భారత్ నేపాల్ మధ్య ఉన్న సంబంధాలను చెడగొట్టి... నేపాల్కు ఆర్థికంగా సహాయం చేసే నేపాల్ లో తమ వైపుకు తిప్పుకుంది చైనా. అంతేకాకుండా వెనకుండి  నడిపిస్తూ నేపాల్ తో  భారత్ పైన విమర్శలు చేయించింది. 

 


 ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధాని భారత్ పై  ఎన్నో రోజుల పాటు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేసారు . అంతేకాకుండా చైనా తరహాలోనే విస్తరణ వాదంతో భారత్లో తమ విభాగాలు ఉన్నాయి అంటూ ఓ సరికొత్త వాదనను తెరమీదకు తెచ్చింది నేపాల్. ఇక ప్రస్తుతం చైనాకు నేపాల్ మిత్ర దేశంగా  కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా నేపాల్ కీ సంబంధించి సరికొత్త వాదన తెరమీదికి వచ్చింది. ముందునుంచి విస్తరణ వాదంతో ముందుకు సాగుతున్న చైనా  ప్రభుత్వం... మిత్ర దేశమైన నేపాల్లో విషయంలో కూడా ఇదే తీరుతో ముందుకు సాగుతుందని తెలుస్తోంది. 

 


 నేపాల్లోని చాలా చోట్ల భూభాగాలను ఆక్రమించుకోవడంతో పాటు నేపాల్ లో రెండు గ్రామాలను కూడా చైనా ఆక్రమించుకున్నదని  భారత గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైనాతో మిత్ర దేశం గా ఉండడం ఇష్టంలేక నేపాల్ లో ఎంతో మంది ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టారు. చైనా  ఆక్రమించుకున్న రెండు గ్రామాల ప్రజలు కూడా వేరే గ్రామానికి తరలి వెళ్తున్న సమయంలో.. వారిని అడ్డగించి  వారి నుంచి భూ దస్తావేజులు కూడా లాక్కుని ప్రస్తుతం మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. అయితే నేపాల్ ని మరో టిబెట్  లాగా తయారు చేయడానికి చైనా  ప్రయత్నిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: