ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా వైరస్ ని ఎదుర్కొనడంలో సక్సెస్ సాధించే దిశగా వైయస్ జగన్ సర్కార్ అద్భుతమైన పరిపాలన చేస్తుందని దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు పొగుడుతున్నారు. కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో జగన్ అవలంబించిన తీరుపై రాష్ట్రంలో నెలకొన్న కేసుల విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా గానీ వాటిని పట్టించుకోకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తూ... ఎక్కడికక్కడ కరోనా చైన్ తెగ గొట్టే విధంగా జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీ ప్రజలను కరోనా బారిన పడకుండా కాపాడుతూ వస్తోంది. చాలా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కరోనా నిర్ధారణ పరీక్షలు విషయంలో అలసత్వం ప్రదర్శించడంతో ఇప్పుడు ఆయా రాష్ట్రాల పరిస్థితి చాలా దారుణంగా మారింది.

 

వ్యాపారాలు కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో కూడా ఇదే విధంగా పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా జగన్ పనితీరు అంతా బానే ఉన్న గాని లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ… ముఖానికి మాస్క్ పెట్టుకోకుండా పబ్లిక్ మీటింగ్ లో… ఇంకా అధికారులతో మాట్లాడుతున్న సమయంలో సీఎం జగన్ మాస్కు ధరించకుండా ఉండటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు గట్టిగా విమర్శలు చేస్తున్నారు. సామాన్య ప్రజలు మాస్క్ లు ధరించకపోతే జరిమానా విధిస్తారు. అదే మీరు మాస్కు ధరించకుండా బయట తిరిగిన మీకు జరిమానాలు విధించే వారు లేరా ? అంటూ నిలదీస్తున్నారు.

 

చట్టాలు సామాన్యులకే నా ప్రజాప్రతినిధులకు వర్తించవా అంటూ మండిపడుతున్నారు. ఇటీవల దేశ ప్రధాని మోడీ ఆన్ లాక్ టైం లో చేసిన ప్రసంగంలో దేశంలో సర్పంచ్ మొదలుకొని దేశ ప్రధాని వరకు అందరూ మాస్కు ధరించాలి అని మరీ మరీ చెప్పారు. అలాంటిది మోడీ ఆదేశాలను కూడా వైయస్ జగన్ ఏమాత్రం లెక్కచేయకుండా పబ్లిక్ సమావేశాలలో పాల్గొనడం పట్ల చాలా మంది రాజకీయ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: