కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలను వణికించిన చైనా ఇటీవల భారత్ ఇండియా సరిహద్దు ప్రాంతంలో 20 మంది ఇండియన్ ఆర్మీ జవాన్లను పొట్టన పెట్టుకోవడం జరిగింది. గత నెల 15వ తారీఖున గాల్వాన్ లోయ లో భారత్ మరియు చైనా ఆర్మీ జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో గొడవ చోటుచేసుకోవడం ఇరు దేశాలకు చెందిన సైనికుల ప్రాణాలు పోవటం అంతర్జాతీయంగా ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. కచ్చితంగా ఇండియా చైనా దేశాల మధ్య యుద్ధం జరగడం గ్యారెంటీ అని అందరూ భావించారు. కాగా చైనా మన సైనికులని చంపడంతో సోషల్ మీడియాలో చైనా వస్తువుల పై నిషేధం విధించాలంటూ చాలా మంది నెటిజన్లు కోరటంతో కేంద్రం ఇటీవల చైనా యాప్స్ 59 పై నిషేధం విధించడంతో పాటు మరికొన్ని వాటిపై కఠిన నిబంధనలు అమలు చేస్తూ చైనా మార్కెట్ ని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంది.

 

ఇదిలా ఉండగా చైనా దేశంలో మన భారతీయులు ఉండిపోవడంతో ఇప్పుడు ఆ దేశంలో రెస్టారెంట్లలో మన దేశ పౌరులని రాణించడం లేదు. నిర్మొహమాటంగా రెస్టారెంట్ బయట బోర్డు పెట్టి ‘ఇండియన్స్ నాట్ ఎల్లూవుడ్’ టూ అంటూ బయటికి పంపి చేస్తున్నారట. వాళ్ల దేశానికి చెందిన యాప్స్ మొత్తం బ్యాన్ చేయడంతో చైనా వాళ్ళు ఈ విధంగా ఆ దేశంలో ఉన్న మన దేశస్తులకి కనీసం తిండి కూడా దొరక నివ్వకుండా చేస్తున్నారట. ఇదిలా ఉంటే కొంతమంది మన దేశంలో ఉన్న వాళ్ళు చైనా ప్రొడక్ట్స్ ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తూ.. వస్తే వాటిని ఇప్పటికీ కొంటూనే ఉన్నారు. చైనా వాళ్ళు కావాలనే దెబ్బ కొట్టి మన వాళ్ళను హింసిస్తుంటే, మనం మాత్రం ఇంకా వాళ్ళ వస్తువుల పై ఆధారపడటం దౌర్భాగ్యం.

 

ఇది మన దౌర్భాగ్య పరిస్థితి. వాళ్లు మన దేశస్తులను అనేక ఇబ్బందుల పాలు చేస్తున్న టైంలో ఈ విధంగా చైనా వస్తువులను కొనటం బట్టి చూస్తే....మనలో యూనిటీ లేదని, కాబట్టి ఇప్పటి నుండైనా ఇక పూర్తిగా చైనా వస్తువులను దూరం పెట్టాలని నెటిజన్లు ఈ వార్త విని సోషల్ మీడియాలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: