ప్రత్యర్థులను చిత్తు చేయడంలో ఎన్నికలలో గెలవడం లో మోడీని మించిన వారు మరొకరు ఉండరని ఆయన గురించి చాలామంది రాజకీయ ప్రత్యర్ధులు అంటుంటారు. ముఖ్యంగా సొంత పార్టీలో ఎంతో సీనియారిటీ ఉన్న నాయకులు అయినా తన విషయంలో తోక జాడిస్తే అలాంటివారికి మోడీ తనదైన రీతిలో ప్రధాని అయ్యాక కోలుకోలేని రాజకీయ దెబ్బలు కొట్టడం మనం చూశాం. అద్వానీ మరియు వెంకయ్య నాయుడు ఇంకా కొంతమంది నాయకులు మోడీ మొదటిలో ప్రధాని అభ్యర్థి అని ప్రకటించాక వీళ్ళు కొంత అతిగా ప్రవర్తించడంతో మోడీ ప్రధాని అయ్యాక రెగ్యులర్ పాలిటిక్స్ లో కనీసం వాళ్ళ మొహాలు కూడా కనబడకుండా కార్నర్ చేశారని చాలామంది చెబుతారు.

 

ఇదిలా ఉంటే బీజేపీ పార్టీకి చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని మాత్రం మోడీ మొదటి నుండి దేశంలో ఆ పార్టీ ఉండకూడదు అంటూ నినాదాలు చేస్తూ... ప్రజల జీవితాల్లో మార్పులు రావాలంటే బీజేపీ పార్టీని గెలిపించాలని 'కాంగ్రెస్ హటావో దేశ్ కి బచావో' అన్నట్టుగా మోడీ వ్యవహరించడం జరిగింది. 2014 ఎన్నికల టైంలో కనీస స్థానాలు రాకుండా కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టిన మోడీ 2019 ఎన్నికల్లో కూడా అదే రీతిలో దెబ్బ కొట్టడం జరిగింది. దేశంలో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోయింది.

 

ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా మోడీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ని మోడీ టార్గెట్ చేశారట. ఆదాయపు పన్ను శాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ ట్రస్ట్ నడుస్తోందని ఇటీవల ఆరోపణలు రావడంతో ఈ విషయంలో మోడీ సిబిఐ ఎంక్వైరీ చేయించి సోనియా గాంధీ ని రాజకీయంగా పూర్తిగా ఇరుకున పెట్టాలని మోడీ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: