దేశంలో రోజురోజుకీ  కేసులు పెరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు రోజు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం మరియు వైద్యులు తెగ టెన్షన్ పడుతున్నారు. మరొకసారి పూర్తిస్థాయిలో లాక్ డౌన్ చేపడితే కరోనా చావుల కంటే ఆకలి చావులు ఎక్కువ అవుతాయి అని ఇంకోసారి లాక్ డౌన్ చేయటానికి కేంద్రం ఏమాత్రం సాహసించడం లేదు. దేశ పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చాలా ప్రమాదకరంగా ఉంది. కనీసం రాష్ట్రంలో ప్రభుత్వం కరోనా రోగుల పట్ల కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నట్లు రోజు సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలే రకరకాల వీడియోలు చిత్రీకరిస్తూ పోస్ట్ చేస్తున్నారు.

IHG

గాంధీ ఆసుపత్రిలో అయితే ఏకంగా కరోనా రోగులను కింద కూర్చోబెట్టి చికిత్స అందించిన వీడియో చూసి చాలా మంది కేసీఆర్ ప్రభుత్వాన్ని నెటిజన్ లు బండ బూతులు తిట్టడం జరిగింది. మరోపక్క గవర్నర్ కలుగజేసుకుని కరోనా బాధితులను ఆదుకోవాలని ప్రయత్నించిన గాని ప్రభుత్వ అధికారుల నుండి సరైన సహకారం రావటం లేదు. ఇలాంటి తరుణంలో గవర్నర్ కేంద్ర సాయం తో రాష్ట్రంలో కరోనా కేసులు అరికట్టడానికి ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

IHG

ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిటీ స్థాయిలో కరోనా వ్యాప్తి ఆల్ రెడీ జరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో తెలంగాణ హైకోర్టు కరోనా కట్టడి విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు అందుతున్నాయి. గవర్నర్ ఆదేశాలు పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తరుణంలో కీలక ఆదేశాలు కరోనా నిర్మూలన విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ ఇవ్వనున్నట్లు  తెలంగాణ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: