జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల వ్యవహరిస్తున్న తీరు సొంత పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ అతి తక్కువ టైమ్ లోనే అద్భుతమైన ప్రజాదరణ పొందిన పార్టీగా ఏపీ రాజకీయాల్లో ఆవిష్కరించబడింది. ముఖ్యంగా పార్టీ కొత్తలో ఎలక్షన్ టైం లో యువత ఓటు బ్యాంకు ఎక్కువగా జనసేన పార్టీకి అప్పట్లో ఆకర్షితులు కావటంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటం జరిగిందని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు చెబుతుంటారు. అంతేకాకుండా ఏపీలో ఎక్కువ ఓటు బ్యాంకు కలిగిన కాపు సామాజికవర్గం అండదండలు కూడా జనసేన పార్టీకి ఉండటంతో పవన్ కళ్యాణ్ సరిగ్గా కాన్సెంట్రేషన్ చేస్తే రాజకీయాలలో తిరుగులేని నేతగా రాణించడం గ్యారెంటీ అని చాలామంది చెప్పుకొస్తున్నారు.

 

ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కేవలం తనని తాను నాలుగు గోడల మధ్య పరిమితం చేసుకుని కింద స్థాయి నాయకులతో కలుపుకోకుండా పార్టీని పద్ధతి ప్రకారం ఫామ్ చేసుకోకుండా ఉండటం పట్ల తీవ్రస్థాయిలో సొంత పార్టీలోనే విమర్శలు వినబడుతున్నాయి. ఇటీవల బీజేపీ పార్టీతో చేతులు కలిపిన తర్వాత పూర్తిగా సోషల్ మీడియా కి పరిమితం అయి పోస్ట్ లు పెట్టడం తప్ప క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసిన సందర్భాలు ఏమీ లేవు. మొదటి నుండి పార్టీ నాయకులతో కలుపుగోలు లేకుండా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని ఆయన ఎప్పుడూ మీడియా ముందుకు వస్తారో ఎప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారో ఎవరికీ అర్థం కాదని సొంత పార్టీలో ఉన్న నాయకులే అంటున్నారట.

 

దీంతో పవన్ కళ్యాణ్ కింద స్థాయి నాయకులతో పాటు మిత్రపక్షంగా ఉన్న బిజెపి నాయకులతో కలుపుగోలుగా రాజకీయాలు చేస్తే బాగుంటుందని పార్టీలో కార్యకర్తలు నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఎవరిని కలుపుకోకుండా ఉంటే మరోసారి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడే పరిస్థితి తప్పదని సలహాలు ఇస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పార్టీతో మంచి యాక్టివ్ పాలిటిక్స్ అతి తక్కువ టైమ్ లోనే చేసి ప్రత్యర్థిని అద్భుతంగా దెబ్బతీశారు. అదే జోష్ 2019లో చూపించి ఉంటే జనసేన పార్టీకి ఒక స్థానం వచ్చేది కాదని భారీ స్థాయిలో స్థానాలు దక్కేవి అని పార్టీలో ఉన్న నాయకులు  అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సొంత రాజకీయాలు కాకుండా ఇతర పార్టీలతో కలిసి నడవాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: