ప్రస్తుతం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న విషయాలలో ఒక విషయం ఏపీ రాజధాని అమరావతి విషయం. చంద్రబాబు హయాంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తించడం జరిగింది. దాదాపు 30 వేలకు పైగా ఎకరాలు రైతులు ఏపీ రాజధాని కోసం ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దేశంలోనే ఒక రాష్ట్ర రాజధాని కోసం ఇన్ని వేల ఎకరాలు ప్రభుత్వం సేకరించటం ఇదే ప్రథమం. ఇదిలా ఉండగా తర్వాత వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు నిర్ణయాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే వైయస్ జగన్ మూడు రాజధానులు అని ప్రకటించడం జరిగిందో అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన 29 గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ప్రభుత్వంపై తిరగబడ్డారు.

 

అమరావతి నే ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత ప్రజలు రైతులు చేస్తున్న దీక్షకు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల వాళ్ళు చేస్తున్న దీక్షలు ఆందోళనలు 200 రోజుకు చేరుకోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత మోడీదే అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అప్పట్లో రాజధాని ప్రాంతంలో మోడీ శంకుస్థాపనకు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఏపీ రాజధాని విషయంలో కేంద్రం కలుగ చేసుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు.

 

జగన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్రం అధికార పార్టీ దూకుడును కట్టడి చేయాలి అన్నట్లుగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఇంత సీరియస్ మేటర్ లో మోడీ సపోర్ట్ మాత్రం వైయస్ జగన్ కి ఉన్నట్లు జాతీయ స్థాయి లో టాక్ నడుస్తుంది. ముందు నుండి రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోవటం జరగదని క్లారిటీ ఇవ్వడం జరిగింది. పైగా అమరావతి ప్రాంతం రాజధానిగా ఏమాత్రం సరిపోదని కేంద్రం అప్పట్లో సర్వే చేసి నివేదిక కూడా చంద్రబాబు ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. ఇలాంటి తరుణంలో ఏపీ క్యాపిటల్ విషయంలో జగన్ కే మోడీ ఫేవర్ అన్నట్టు టాక్ జాతీయస్థాయిలో వినబడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: