ఎప్పటికప్పుడు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తూ ఉంటారు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అప్పటి నుంచి టీడీపీ కీలక నేతలే టార్గెట్ గా వైసీపీ ముందుకు వెళ్తున్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇటువంటి పరిణామాలు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులే కాకుండా, మండల నియోజకవర్గ స్థాయి నాయకులపైన, అక్రమంగా కేసులు పెట్టి, వారిని వెంటాడి వేధిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ పదేపదే ఆరోపణలు చేస్తోంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది అవినీతి ఆరోపణలు రావడమే కాకుండా, సాక్ష్యాలతో సహా దొరికిపోవడంతోనే కేసుల్లో ఇరుకుంటున్నారు. అయినా వైసిపి వేధిస్తోందనే ప్రచారాన్ని టిడిపి అధినేత చంద్రబాబు చేస్తూనే వస్తున్నారు.

IHG

 

ఇది ఇలా ఉండగా, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు, నిరసనలు చేపట్టేందుకు గాని, ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ముందుకు వచ్చేందుకు టిడిపి క్యాడర్ ఎవరు ఇష్టపడటం లేదు. అలాగే పార్టీ కార్యక్రమాలకు కూడా చాలామంది నాయకులు డుమ్మా కొట్టడం ఇప్పుడు పార్టీలో యాక్టివ్ గా కనిపిస్తే, అధికార పార్టీ తమను టార్గెట్ చేసుకుంటుందనే భయంతో చాలామంది నాయకులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. ఈ నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 800 మంది టిడిపి నాయకులను టార్గెట్ చేసుకుని వారిపై అక్రమ కేసులు బనాయించింది అని, అక్రమ కేసులు కారణంగానే ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, మిగతా వారు వారి పరిస్థితిని చూసి ముందుకు వచ్చేందుకు భయపడుతున్నారనే విషయం బాబు వరకు చేరడంతో పార్టీ కేడర్ లో భరోసా నింపి, వారికి వెన్నుదన్నుగా నిలబడేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

 

ఇప్పటి వరకు పార్టీ కీలక నాయకులకు మాత్రమే పార్టీ తరఫున న్యాయసహాయం అందేది. కానీ ఇప్పుడు మండల స్థాయి నాయకులకు కూడా న్యాయ సహాయం అందించే విధంగా మండలానికి ఒక న్యాయవాదిని పార్టీ తరఫున నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. ఈ మేరకు వారికి పార్టీ తరఫున జీతభత్యాలు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. పార్టీ నేతలకు న్యాయ సహాయం అందిస్తే పార్టీ కేడర్ లో భయాందోళనలు తగ్గుతాయి అని, ఎవరైనా పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించే అవకాశం ఉంటుందని, ఒకవేళ ప్రభుత్వం గనుక వారిపై కేసులు బనాయిస్తే జైలుకు వెళ్లకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు మండలినికి ఒక న్యాయవాదిని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: