అనుమానం పెనుభూతం.. ఈ విషయం అందరికి తెలిసిందే.. ఇంకా అలాంటి అనుమానం పెళ్లైన కొత్త జంటకు అనుమానాలు వస్తాయి. ఇంకా ఆలా అనుమానంతో బాధ పడుతున్నప్పుడు ఇంట్లో పెద్దలు కొన్ని సలహాలు, సూచనలు చేస్తుంటారు. అలాంటిది పెద్దవారే గొడవలు పడితే.. అనుమానంతో కొట్టుకుంటే ఎంత దారుణంగా ఉంటుంది?   

 

ఇంకా అలాంటి ఘటనే కర్నాటక రాజధాని అయినా బెంగుళూరులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ భామకు 69 ఏళ్లు, పెళ్లి జరిగి ఏకంగా 44 ఏళ్ళు అవుతుంది.. అలాంటి ఆమె ఈ వయసులో పక్కింటి కుర్రాడికి సాయం చేస్తుంది అని అనుమానపడ్డా 75 ఏళ్ల భర్త. అతనితో నీకు ఏంటి పని అంటూ వాదనకు దిగాడు. ఇంకా ఆగ్రహంతో ఆమె చేయి విరగొట్టేశాడు..       

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరుకు చెందిన ఓ రిటైర్డ్ సచివాలయ ఉద్యోగి(75) భార్య(68) కలసి ఉంటున్నారు. అయితే గత సంవత్సరం వారిపై పోర్షన్‌లోకి ఓ 34 ఏళ్ల యువకుడు ఫ్యామిలీతో అద్దెకు దిగాడు. అయితే అతని భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. దీంతో కింద పోర్షన్‌లో ఉంటున్న బామ్మ అతనికి వంటలో సాయం చేస్తుంది.       

 

ఇంకా ఇది గమనించిన పెద్దాయన అతనితో సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. ఇది కాస్త వివాదానికి దారితీసింది. ఇంకా అలా జరిగిన వివాదంలోనే ఆమె ఎడమ చెయ్యి విరగొట్టాడు. దీంతో ఆమె బెంగుళూరు పోలీసులను ఆశ్రయించింది. పరిహార్ హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేసి ఈ వయసులో నాపై అనుమానం పెంచుకుని చేయి విరగ్గొట్టాడని ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఆ వృద్దులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే 75 ఏళ్ళ వయసులో కూడా భార్యపై అనుమానం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.       

మరింత సమాచారం తెలుసుకోండి: