దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. పది రోజుల క్రితం తక్కువ సంఖ్యలో కేసులు నమోదైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం 1500కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరస్ ఉధృతి కొనసాగుతోంది. 
 
అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోడ్లపైకి జనసంచారం పెరగడం, కొందరు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇతరులు సైతం వైరస్ భారీన పడుతున్నారు. చైనాలోని వుహాన్ లో మొదలైన కరోనా మహమ్మారి నేడు భారత్ లోని పల్లెలకూ పాకింది. జ్వరమో, దగ్గో వచ్చినా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే కరోనా నుంచి కోలుకున్న విజేతలు మాత్రం వైరస్ భారీన పడినా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. 
 
లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రికి వెళ్లడంలో ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని... మనోధైర్యంతో వైరస్ ను జయించడం సాధ్యమేనని... డాక్టర్లు సూచించిన మందులు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటే మాత్రం సులభంగానే వైరస్ నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు. కరోనా సోకితే దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, లవంగాల కషాయం తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. 
 
కరోనా సోకినా ఆందోళనకు గురి కావద్దని.... పాజిటివ్ అని తెలిస్తే గోరువెచ్చని నీటిలో పసుపు, ఉప్పు వేసి రోజుకు ఐదుసార్లు పుక్కలిస్తే మంచిదని అనంతపురానికి చెందిన ఒక యువ వైద్యుడు తెలిపారు. లక్షణాలను బట్టి చికిత్స చేయించుకుంటే సరిపోతుందని... లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేస్తే ఆక్సిజన్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని.... సరైన సమయంలో చికిత్స చేయించుకుంటే వైరస్ ను జయించడం సాధ్యమేనని వైద్యులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: