దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం అందరిలో ప్రాణభయం పెరిగిపోతూ ఉంది. దేశంలో రోజురోజుకు భారీగా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఏం చేయాలన్న భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం జనాలందరికీ. ఈ మహమ్మారి వైరస్ కు ఇప్పటి వరకు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాకపోవడం.. మరింత భయాందోళనకు గురిచేస్తోంది. గత కొంతకాలం వరకు కరోనా  వైరస్కు వ్యాక్సిన్ వస్తుందని ఆశగా ఎదురు చూసిన ప్రజలందరూ ప్రస్తుతం పెరుగుతున్న కేసులను చూస్తూ ఈ వైరస్ తో సహజీవనం చేయడం తప్పదు అని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మహమ్మారి వైరస్ నుంచి ఎలా తప్పించుకోవాలి అనే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు.



కేవలం మాస్కులు ధరించి శానిటైజర్ వాడటమే కాదు.. రోగ నిరోధక శక్తిని పెంచడం ఎలా అన్న దానిపై ఎన్నో చిట్కాలను కూడా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా  వైరస్ పై జనాలకు ఉన్న భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. ఇవి తింటే కరోనా  వైరస్ పోతుంది... అది తింటే కరోనా  వైరస్ కు చెక్ పెట్టొచ్చు అంటూ సోషల్ మీడియాలో ఎన్నో ప్రచారాలు చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ఈ ప్రచారాలతో అటు ప్రజలు కూడా అయోమయంలో పడిపోతున్నారు.



తాజాగా ఇక్కడొక స్వీట్ షాప్ యజమాని ఇలాంటిదే చేశాడు. కరోనా వైరస్ భయాన్ని  క్యాష్ చేసుకుని  బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకున్నాడు.  తన షాపులో మూలికలతో తయారైన మైసూర్ పాక్ తింటే ఒక్కరోజులోనే కరోనా  వైరస్ నుంచి కోల్పోవచ్చు అంటూ ప్రచారం మొదలు పెట్టాడు. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా తోటపాలెయం  లోని లాలా అనే స్వీట్ ఎజమాని మైసూర్ పాక్ తింటే కరోనాకు చెక్ పెట్టొచ్చు అంటూ ప్రజలను బురిడీ కొట్టించాడు, ఇక ఈ విషయం ఆహార శాఖ అధికారుల వరకు వెళ్లడంతో.. షాప్ పై తనిఖీలు నిర్వహించిన అధికారులు... షాప్ ని సీజ్ చేశారు. ఇలాంటి అవాస్తవాలను ప్రజలు నమ్మి మోసపోవద్దు అని సూచించారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: