ఒకప్పుడు అన్ని రాష్ట్రాల కంటే అతి తక్కువగా కేసులు  ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా  కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇక మొన్నటివరకు తెలంగాణ ప్రజలందరికీ కరోనా  వైరస్ మహమ్మారి గురించి భయపడవద్దు అంటూ ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఎక్కడ తెరమీద కనిపించడం లేదు. దీంతో కరోనా  వైరస్ పై ప్రభుత్వం చేతులెత్తేసింది అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల దృశ్య ఏం చేయాలో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో ఉంది తెలంగాణ ప్రజానీకం. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా కరోనా వైరస్ దరి చేరుతుంది.


అయితే ఈ మహమ్మారి వైరస్కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అని చెబుతున్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం భయం పోవడం లేదు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులను చూస్తుంటే ఆ వైరస్ వచ్చేంతవరకు ప్రాణాలు ఉంటాయా అనే అనుమానం కూడా కలుగుతోంది తెలంగాణ ప్రజానీకానికి. అయితే మొన్నటి వరకు కరోనా  వైరస్ బారిన పడిన వారందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు.


రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ కు సంబంధించిన చికిత్స అందించారు. అయితే తక్కువ సమయంలోనే ప్రభుత్వాస్పత్రిలో సరైన చికిత్స అందించడం లేదని కనీసం రోగులను మనుషుల్లో కూడా చూడటం లేదు అన్న టాక్ బయటకొచ్చింది.  కరోనా  చికిత్స తీసుకున్న పేషెంట్లు కూడా ఇది  బయటకు చెప్పడం లాంటి ఘటనలు కూడా తెరమీదకు వచ్చాయి. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ సోకితే ధైర్యంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటే  వైరస్ బారి నుంచి బయట పడవచ్చు అని అందరికీ అవగాహన ఉంది.



కానీ కరోనా  వైరస్ వచ్చిన తర్వాత  చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటేనే అందరూ వణికిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా  వైరస్ పేషెంట్ లకు ప్రభుత్వ ఆసుపత్రులు భరోసా ఇవ్వలేకపోతున్నామని అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.  ప్రస్తుతం గవర్నమెంట్ ఆసుపత్రి ల్లో  90% బెడ్లు కూడా కాళీ గానే ఉన్నాయి.

 ఇదే సమయంలో ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా  వైరస్ పేషెంట్ కోసం ఏర్పాటు చేసిన బెడ్స్  అన్నీ నిండుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎవరైనా రాజకీయ ప్రముఖుల అపాయింట్మెంట్ ఉంటేనే కరోనా  వైరస్ పేషెంట్లను ఆసుపత్రిలో చేర్పించూకుంటున్నారట. ఇక  ప్రైవేట్ ఆస్పత్రిలో ఫీజుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: