కరోనా  వైరస్... మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది.. మనుషుల్లో మానవత్వం కనిపించకుండా చేస్తోంది... ప్రాణ భయాన్ని  పెంచి బంధాలకు బంధుత్వాలకు విలువ లేకుండా చేస్తుంది... చివరికి మనిషిని మానసికంగానే చంపేస్తుంది ఈ మహమ్మారి వైరస్. కరోనా  వైరస్ భయం తో సొంత వాళ్లే రోడ్డున విడిచి వెళుతున్న ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ప్రాణాలు పోతాయేమో అనే  భయం బంధాలు బంధుత్వాలు అనే ప్రేమను చంపేస్తుంది. ఇలా మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది ఈ మహమ్మారి వైరస్. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటి ఓ అమానుష ఘటన జరిగింది.



 ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని  బస్సు నుంచి కిందకు దింపగా. ఏకంగా  భార్యకు కూడా అతన్ని  నడిరోడ్డుపైనే వదిలేసి వెళ్ళింది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం కు చెందిన వ్యక్తి కీ  కరోనా లక్షణాలు కనిపించడంతో రెండు రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు. ఇక ఆ తర్వాత గురువారం సాయంత్రం సమయంలో భార్యతో కలిసి బస్సులో సొంత ఊరికి బయలుదేరాడు. బస్సు కరప సమీపంలోకి రాగానే ఆ వ్యక్తికి కరోనా  వైరస్ పాజిటివ్ అని వచ్చింది అని.. రిపోర్టులు వచ్చేంతవరకు ఆసుపత్రిలో ఉండాలి అంటూ వైద్యులు ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ సిబ్బంది ఆ భార్యభర్తలిద్దరిని  కరప మార్కెట్ సెంటర్లో కిందకు దింపి వెళ్ళిపోయారు.



అయితే అప్పటికే కరోనా  వైరస్ సోకింది అనే మనస్థాపం లో ఉన్న సదరు వ్యక్తి .. అతని భార్య నడిరోడ్డు పైన వదిలేసి కనిపించకుండా వెళ్లిపోయింది. భార్య తీరుతో మరింత మనస్థాపం చెందిన సదరు వ్యక్తి నడిరోడ్డుపైనే దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కాకినాడ జిజిహెచ్ ఈ విషయం తెలిపగ  అతన్ని  అక్కడినుంచి తరలించినట్లు సమాచారం.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: