దూబే ఎన్ కౌంట‌ర్ ప్లాన్ ప్ర‌కారం జ‌ర‌గ‌వ‌చ్చు...?! లేదంటే నిజంగానే జ‌ర‌గ‌వ‌చ్చు...అయితే క‌రుడు గ‌ట్టిన గ్యాంగ్ స్ట‌ర్ దూబే ఎన్‌కౌంట‌ర్‌ను మాత్రం భార‌త‌వ‌ని మొత్తం హ‌ర్షిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌‌కు చెందిన టాప్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీన్ని పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. గురువారం అత్యంత నాట‌కీయ ప‌రిణామాల న‌డుమ మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయినీలో వికాస్‌దూబేను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు వ‌ర్గాల నుంచి ప్రాథ‌మికంగా తెలుస్తున్న వివ‌రాల ప్రకారం.. దూబేను త‌ర‌లిస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) వాహ‌నం.. శుక్ర‌వారం ఉద‌యం కాన్పూర్ స‌మీపంలోని బార్రా ప్రాంతం ద‌గ్గ‌ర బోల్తా ప‌డంది.

 

ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.. వాహనంలో ఎస్టీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు వికాస్ దూబే కూడా ఉన్నాడు.. అయితే అంతా స్వ‌ల్పంగా గాయ‌ప‌డిన‌ట్టు తెలుస్తుండ‌గా.. ఈ ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత‌ వికాస్ దూబే త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేసిన‌ట్టుగా స‌మాచారం. పారిపోవ‌డానికి య‌త్నించిన దూబేపై కాల్పులు జ‌ర‌ప‌డంతో మ‌ర‌ణించిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే సెటిల్‌మెంట్ల అతి త‌క్కువ కాలంలో వంద‌ల కోట్ల రూపాయాల‌ను సంపాదించ‌డంతో పాటు అనేక నేరాలు వికాస్‌దూబేపై ఉన్నాయి. ఈనేప‌థ్యంలో సాక్ష్యాధారాల‌తో అరెస్ట్ చేయ‌డానికి వెళ్లిన పోలీసుల‌పై కాల్పులు జ‌ర‌ప‌డంతో 8మంది మృతిచెందారు. ఈ ప‌రిణామాన్ని తీవ్రంగా తీసుకున్న ఉత్త‌ర ప్ర‌దేశ్ పోలీసులు అంత‌మొందించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌తీకారంగానే దూబేను అంతం చేసిన‌ట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉండ‌గా వికాస్ దూబే సన్నిహిత బంధువుల పేరిట దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాటు పలు దేశాల్లో  ఆస్తులున్నాయని వెల్లడైంది.దూబే 8 నెలల క్రితం లక్నో నగరంలో రూ.5కోట్లు వెచ్చించి ఓ భవనం కొన్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతోపాటు బ్యాంకాంక్ నగరంలో ఓ హోటల్ లో వికాస్ దూబే పెట్టుబడి పెట్టాడని సమాచారం. వికాస్ దూబేకు 12 ఇళ్లు, 21 ఫ్లాట్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దూబే సన్నిహితడి పేరిట ఆర్యనగర్ లో 28 కోట్ల ఆస్తులున్నాయని తేలింది. ఆర్యనగర్ లో దూబే సన్నిహితుడి పేరిట 8 ఫ్లాట్లు ఉన్నాయని, వీటి విలువ 5కోట్లరూపాయలుంటుందని తేల్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: