మనకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన పండ్లు ఎన్నో ఉన్నాయి. అందులో అనాస పండు ఒకటి. చాలామంది వంటింటి చిట్కాలు పాటిస్తుంటే. కొందరు పండ్లు, కూరగాయల ద్వారా శరీరానికి రోగ నిరోధక శక్తి అందించే ప్రయత్నం చేస్తున్నారు. అనాస వల్ల కలిగే ఉపయోగాలు ఆరోగ్యానికి ఎన్నో లాభాలు చేకూరుస్తాయి. దీని నుండి తీసిన రసం పానీయంగా తాగుతారు. ఇది వాతాన్ని, కఫాన్ని ఉపశమనం చేయడంలో ఇది ఉపయోగ పడుతుంది.

 


ఈ పండును తింటే శరీరంలోని జీర్ణ శక్తిని పెంచుతుంది.రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది.
ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. పూర్తిగా పండని అనాస రసం తీసు కుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

 

 

జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాస రసం ఇవ్వడం ఎంతో మంచిది. అనాస పండును ఆహారంగా తీసుకోవడం అందరికీ తెలిసిందే! కానీ అందచందాలను ఇనుమడింపజేసే శక్తి కూడా ఎక్కువగా ఉంది.అనాసపండు రసాన్ని ముఖాని కి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది.

 

 

అనాసలోని ఎంజైమ్స్‌ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధుల ను, టైఫాయిడ్‌ని ఉప శమనం చేస్తుంది.
ఇది అర గడానికి రెండు గంటలు పడుతుంది. పండని అనాసకాయ తింటే అరగడం చాలా కష్టమవుతుంది. దీనితో విరేచనాలు అవుతాయి. బాగా పండిన అనాస రసం శరీర తాపాన్ని తగ్గిస్తుంది. అదనపు శక్తిని కూడా కలిగిస్తుంది. ఈ పండులో ఉన్న కొన్ని ఎంజైమ్స్‌ కారణంగా జీర్ణశక్తి పెరిగి జీర్ణాశయానికి చక్కగా పని చేస్తుంది. ఈ పండులో అధికమైన పీచుపదార్థం మలబద్దకానికి మంచి మందుగా పని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: