భారత దేశం అంటే పల్లెటూళ్లే.. ఇంకా మన దేశంలో 60 శాతానికి పైగా నివసించేది గ్రామాల్లోనే.. కానీ ఆ గ్రామాల్లో కనీస సౌకర్యాలు కూడా కరవవుతున్నాయి. ఇక మారుమూల పల్లెటూళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. సరైన రోడ్డు ఉండదు.. తాగేందుకు కనీసం మంచి నీరూ లభించదు. అందుకే సీఎం జగన్ గ్రామాల విషయంలో రాజీ పడటం లేదు. వేల కోట్లు ఖర్చు చేసేందుకు పచ్చజెండా ఊపేస్తున్నారు. 

 


మొత్తం రూ.4,456 కోట్లతో మారుమూల గ్రామాలకు రోడ్లను వేయాలని జగన్ సర్కారు తాజాగా నిర్ణయించింది. వీటిలో ఇప్పటికే 70శాతం టెండర్లు ఖరారై పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన 30శాతం పనులకు త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తారు. రూ.1950 కోట్ల విలువైన పనులకు త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తారు. ఏఐఐబీ దీనికి నిధులు సమకూరుస్తోంది. రోడ్లు–భవనాల శాఖలో భాగంగా ‘న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు’తో చేపట్టిన ప్రాజెక్టుల తొలిదశలో భాగంగా దాదాపు రూ.3200 కోట్లు దీని కోసం ఖర్చు చేస్తున్నారు. 

 


పల్లెలకు రోడ్లు ఎంత ముఖ్యమో తాగునీరూ అంతే.. అందుకే.. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ రక్షిత తాగునీటిని అందించే ప్రయత్నాల్లో భాగంగా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును జగన్  ప్రభుత్వం చేపట్టింది. తొలిదశలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, తూ.గో, ప.గో, గుంటూరులోని పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతం, చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం, కడప జిల్లాలో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకోసం రూ.19,088 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. 

 


వీటితోపాటు కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని 7 నియోజకవర్గాలతో పాటు, డోన్‌ నియోజకవర్గంలో కూడా వాటర్‌ గ్రిడ్‌ చేపట్టాలని జగన్‌ నిర్ణయించారు.  ప్రకాశం జిల్లాలోని మిగిలిన పశ్చిమ ప్రాంతంలోనూ, అనంతపురం జిల్లాలోనూ వాటర్‌ గ్రిడ్‌ పనులు చేపట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారు. వీటి డీపీఆర్‌లు సిద్ధంచేసి టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సీఎం తాజాగా ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: