దేశంలో కరోనా ఎంతగా కలకలం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. కరోనా వల్ల మనుషు ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఓ వైపు ఆర్థికంగా ఎంతోమంది సతమతమవుతున్నారు. చేయాలంటే సరైన పనులు లేవు.. వ్యాపార రంగంలో భారీ నష్టాలతో ఉద్యోగులను తొలగించారు.  ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యలు తట్టుకోలేక మానసికంగా కృంగిపోయిన వారు ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. మరికొంత మంది తమకు కరోనా వచ్చిందన్న భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. కారణం తన వల్ల కుటుంబానికి ఏమీ కాకూడదన్న భయమే ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారని అంటున్నారు. తాజాగా తనకు కరోనా సోకి ఉంటుందన్న అనుమానంతో ఓ స్వర్ణకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

 

ఈ ఘటన ఏపిలోని కర్నూల్ లో జరిగింది. గత కొన్ని రోజులుగా ఏపిలోని కర్నూల్ లో కేసులు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే.  స్థానిక పాతబస్తీ కేవీఆర్ గార్డెన్‌కు చెందిన స్వర్ణకారుడు (46) భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా మార్చి నెల నుంచి ఇంట్లోనే ఉంటున్న ఆయన రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. కరోనా భయంతో బుధవారం ఓ ప్రైవేటు ల్యాబులో పరీక్ష కోసం నమూనాలు ఇచ్చాడు. అప్పటికే తనకు కరోనా వచ్చిందన్న భయంతో ఉన్నాడు సదరు వ్యక్తి.

 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అతడికి నిర్వహించిన కరోనా పరీక్షలో నెగటివ్ అని వచ్చినట్టు తెలిసింది. అయితే, తనకు కరోనా సోకిందన్న భయంతోనే అతడు తొందరపడి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కరోనా వచ్చినంత మాత్రాన చనిపోవాల్సిన అవసరం లేదు.. చికిత్స పొంది బయట పడవొచ్చని వైద్యులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: