కరోనా మహమ్మారిని తరిమికొట్టే వ్యాక్సీన్ కోసం ఇప్పుడు ప్రపంచం మల్ల గుల్లాలు పడుతోంది. ప్రపంచంలోని అనేక దేశాలు ఈ వ్యాక్సీన్ తయారీలో బిజీ అయ్యాయి. అయితే వ్యాక్సీన్ రావడం అంత తేలిక కాదని ఇప్పటికే అర్థమైంది. ఇక అమెరికా కూడా తన వంతు ప్రయత్నాలు చాలా సీరియస్ గా చేస్తోంది. 
 

IHG

అమెరికాలోని ఇన్ స్టిట్యూట్  ఫర్  అలర్జీ అండ్  ఇన్ ఫెక్షియస్  డిసీజెస్... అక్కడి మోడెర్నా సంస్థతో కలసి ఓ వ్యాక్సీన్ రూపొందిస్తోంది. ఈ వ్యాక్సిన్  తయారీ ప్రయోగాలు అనుకున్నవి  అనుకున్నట్టు సజావుగా సాగితే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అమెరికాలోని ఇన్ స్టిట్యూట్  ఫర్  అలర్జీ అండ్  ఇన్ ఫెక్షియస్  డిసీజెస్ డైరెక్టర్, అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్  ఆంటోనీ ఫౌచీ అంటున్నారు. 

 

IHG


అమెరికాలోని ఇన్ స్టిట్యూట్  ఫర్  అలర్జీ అండ్  ఇన్ ఫెక్షియస్  డిసీజెస్ సంస్థ.. మోడెర్నాతో కలిసి ఈ వ్యాక్సీన్ ను అభివృద్ధి చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్  కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.  దీని గురించి ఫౌచీ ఇంకా ఏమంటున్నారంటే..  ప్రస్తుత దశ ప్రయోగాల్లో ఈ టీకా ఆశాజనక ఫలితాలనే ఇస్తోందని కానీ, పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పడతుందని చెబుతున్నారు. 

 

అంతే కాదు.. కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతుందన్నఈయన భవిష్యత్తులో రానున్న మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచం ఏకం కావాల్సిన అవసరం ఉందంటున్నారు. నిజమే కదా..? 

మరింత సమాచారం తెలుసుకోండి: