బ్యాంక్ లో లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. లోన్ తో కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం కరూర్ వైశ్యా బ్యాంక్ బంపర్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా కారును కొనాలని అనుకుంటున్నారా.. అయితే మీ కోసం చాలా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

 

 

దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా తమ వినిమోగదారుల కోసం మెరుగైన సేవలను అందించడానికి వివిధ బ్యాంకులతో చేతులు కలిపింది. దీంతో వినియోగదారులు బ్యాంక్ల నుంచి ఆకర్షణీయ లోన్లను పొందవచ్చు.  అయితే ఈ బాటలోనే ఇప్పుడు మారుతీ సుజుకి సంస్థకు టాటా మోటార్స్ షాకిచ్చింది.

 


తాజాగా టాటా మోటార్స్ కరూర్ వైశ్యా బ్యాంక్ తో జతకట్టింది. టాటా మోటార్స్ కారును కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు పొందుపర్చింది.  టాటా ప్యాసింజర్ వెహికల్ కొనుగోలు చేయాలనుకునే వినిమోగదారులు ఇప్పుడు సులభంగా రుణ సదుపాయం ఏర్పరిచింది.  బ్యాంక్ కస్టమర్లతో పాటు ఇతర వినియోగదారులు ఇజీగా లోన్ పొందవచ్చు.

 


లోన్ కావాలని అనుకున్న వారు దేశవ్యాప్తంగా ఉన్న టాటా మోటార్స్ షోరూంలలో లేదా కరూర్ వైశ్యా బ్యాంక్ బ్రాంచ్ లను సందర్శించి లోన్ అప్లై చేసుకోవచ్చు. కారుకున్న సమానమైన ధరను రుణం రూపంలో మీరు పొందవచ్చు. అంతేకాకుండా రుణం పొందే వ్యక్తి లోన్ పొందిన తొలి 6 నెలలపాటు ఎలాంటి ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం ఉండదు.ఇంకా జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంచారు.

 


ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో కారు లోన్ పొందొచ్చు. అయితే ఈ ఆఫర్ కొన్ని కార్ మోడల్స్ కు మాత్రమే సదుపాయం ఉంది. టాటా టియాగో, టాటా అల్ట్రోజ్, టాటా నెక్సన్ వంటి మోడల్ కార్లకే ఈ లోన్ ఆఫర్ ను టాటా మోటార్ అందిస్తోంది. స్వయం ఉపాధి పొందుతున్న వ్యాపారస్థులు, ఉద్యోగులు, తదితరులు లోన్ల కు అప్లై చేసుకుని టాటా మోటార్ వెహికల్స్ ను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: